ePaper
Wednesday, November 11, 2026
📄 ePaper

అశ్వారావుపేట మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.48.72 కోట్ల ప్రతిపాదనలు!

📰 Generate e-Paper Clip

పట్టణంలోని 22 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి భారీ నిధుల ప్రతిపాదన

మంత్రి వాకిటి శ్రీహరికి అభివృద్ధి పనుల ప్రతిపాదనలు అందజేసిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

పొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్ ఎం. నాగార్జున:అశ్వారావుపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.48.72 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వాకిటి శ్రీహరికి అందజేశారు.

ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురామ్ రెడ్డి, ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు, అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్‌లతో కలిసి ఎమ్మెల్యే మంత్రిని కలిసి పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులపై వివరించారు.

ఈ ప్రతిపాదనల్లో భాగంగా పట్టణంలోని 22 వార్డుల్లో సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్ల నిర్మాణానికి రూ.35.52 కోట్లు, భగత్‌సింగ్ సెంటర్ నుంచి అంబేడ్కర్ నగర్ వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా వర్షపు నీటి కాలువల నిర్మాణానికి రూ.5.87 కోట్లు, నాలుగు వార్డుల్లో ప్రధాన డ్రెయిన్ల నిర్మాణానికి రూ.4.33 కోట్లు కేటాయించాలని కోరారు.

అలాగే పట్టణ పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు జేసీబీ, డోజర్, ట్రాక్టర్లు, స్వచ్ఛ ఆటోల కొనుగోలుకు రూ.2 కోట్లు, ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటుకు రూ.25 లక్షలు, మంచినీటి పైప్‌లైన్ల నిర్మాణానికి రూ.50 లక్షలు, సబ్‌మెర్సిబుల్ మోటార్లు, పంపుసెట్ల ఏర్పాటుకు రూ.25 లక్షలు మంజూరు చేయాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.

ఈ నిధులు మంజూరైతే అశ్వారావుపేట పట్టణంలో రహదారులు, డ్రెయినేజీ, పారిశుధ్యం, వీధి దీపాలు, తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. పట్టణ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిస్తూ ఎమ్మెల్యే సమర్పించిన ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేయాలని పట్టణ ప్రజలు ఆశిస్తున్నారు.

Latest Articles

ఆపదలో ఆపన్నహస్తం.. ప్రాణరక్షణ సేవలకు ప్రశంసాపత్రం!

దమ్మపేట ఫైర్ ఫైటర్ తోట చెన్నారావుకు ఉన్నతాధికారుల అరుదైన గుర్తింపుపొలిటికల్ పవర్,దమ్మపేట: ఆపద...

మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 3 రోజులు జైలు శిక్ష

​ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ...

కొత్తకోటలో అయ్యప్ప భక్తుల కోసం నిత్య అన్నప్రసాద వితరణ ప్రారంభం

– మకర సంక్రాంతి వరకు కొనసాగనున్న అన్నదాన కార్యక్రమం, పొలిటికల్ పవర్ సమగ్ర...

Related Articles

ఆపదలో ఆపన్నహస్తం.. ప్రాణరక్షణ సేవలకు ప్రశంసాపత్రం!

దమ్మపేట ఫైర్ ఫైటర్ తోట చెన్నారావుకు ఉన్నతాధికారుల అరుదైన గుర్తింపుపొలిటికల్ పవర్,దమ్మపేట: ఆపద సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలను కాపాడిన దమ్మపేటకు చెందిన ఫైర్ ఫైటర్ తోట చెన్నారావుకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించాయి....

ముత్యాలమ్మ ఆలయానికి విరాళం.. ఆదివాసీ గ్రామాల రహదారిపై గళమెత్తిన సోయం వీరభద్రం

పొలిటికల్ పవర్, దమ్మపేట, నవంబర్ 11:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం ఆర్లపెంట గ్రామంలో బుధవారం నిర్వహించిన గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి నూతన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ...

అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తాం..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ..

ఎమ్మెల్యే జారె ఆదినారాయణ వినతికి సానుకూల స్పందన నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటానని భరోసా.. ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే జారె, ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్...
error: Content is protected !!