4000 రూపాయల కోసం అఖిలపక్షం సమావేశమా?
అన్ని పార్టీలు నాయకులకు విజ్ఞప్తి..
మీసాల రామన్న మాదిగ తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 27 2026: వీపనగండ్ల మండల కేంద్రంలో వీపనగండ్ల గ్రామపంచాయతీ సెక్రటరీ, ఓ పత్రిక విలేకరికి మధ్య జరుగుతున్న పంచాయతీ. ఓ పత్రిక విలేఖరి, పంచాయతీ సెక్రెటరీ మండల కేంద్రంలో ఎయిర్టెల్ టవర్ మట్టి కొట్టడానికి గ్రామపంచాయతీ టాక్టర్ ఉపయోగించి, వచ్చిన కిరాయి 4వేల రూపాయలను పంచాయతీ సెక్రెటరీ ఫోన్ పే కు, ఎయిర్టెల్ టవర్స్ సంబంధించిన కాంట్రాక్టర్ వేయడం జరిగిందని. ఆ పంచాయతీ సెక్రెటరీని ఒక విలేకరి మీ అకౌంట్లోకి ఎలా అమౌంట్ వేసుకుంటారని అడిగారు. వాళ్ళిద్దరూ మధ్యలో జరిగిన సంభాషణలో ఏది ఎలా జరిగిందో వాళ్ళిద్దరికీ తెలుసు. పంచాయతీ సెక్రెటరీ ఆ విలేఖరిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోవడం జరిగింది. ఆ విలేకరి నామీద కేసు అయిందని అతను ఒక న్యాయస్థానాన్ని ఆక్రమించడం జరిగింది. ఈ 4వేలకు అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి, పంచాయతీ సెక్రెటరీకి మేము సపోర్ట్ ఉంటున్నామని చెప్పడం అఖిలపక్షం ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం. స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతుంది, వీపనగండ్ల మండల కేంద్రంలో ఇప్పటికీ ఎమ్మార్వో ఆఫీస్, ప్రభుత్వ కార్యాలయలు లేవు, ఇలాంటి దాని కోసం అఖిలపక్షం ఏర్పాటు చేయండి. వీపనగండ్ల కు వచ్చిన గురుకుల పాఠశాల కొత్తకోటలో ఉంది. మన ఊరికి ఇప్పటికీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ వచ్చేది ఉంది దాని కోసం పోరాటం చేయండి. మన మండల కేంద్రానికి కోర్టు ఏర్పాటు కావాలి, దానికోసం అఖిలపక్షం ఏర్పాటు చేయండి. వీపనగండ్ల మండల కేంద్రానికి చుట్టుపక్కల గ్రామాలకు బిటి రోడ్లు కోసం, వీపనగండ్ల మండల కేంద్రంలో మహిళ సమాఖ్య భవనం, గ్రామ పంచాయతీ భవనం, ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. ఇలాంటి పైన అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి, ఊరు అభివృద్ధి కోసం పాటుపడాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఎం, బిజెపి, ప్రజాసంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి దాంట్లో అఖిలపక్షం ఏర్పాటు చేసుకొని పోరాటం చేస్తే దానికి అర్థం ఉంటదాని నా యొక్క అభిప్రాయం. వీపనగండ్ల మండల కేంద్రంలో ఒక బీసీ హాస్టల్ పరిస్థితి దుర్మార్గంగా ఉంది. వీపనగండ్లలో ప్రభుత్వ పాఠశాలలోని నిరుపేద విద్యార్థులు చదువు ఎలా ఉందని దానికోసం ప్రయత్నం చేయండి. అఖిలపక్షం అన్ని చెప్పి సపోర్ట్ చేసిన పార్టీలన్నీ విమర్శించడం లేదు, ఊరు అభివృద్ధి పార్టీలు పక్కనపెట్టి ఐక్యతకండి. దానికొక అర్థం అఖిలపక్షం అంటే. బాధతో నేను అడుగుతున్న. కాంగ్రెస్ ప్రభుత్వం జూపల్లి కృష్ణారావు సారధ్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ గ్రామంలో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదు. వీటికోసం అఖిలపక్షం ఏర్పాటు చేయాలని నా యొక్క మనవి.

