పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ సెప్టెంబర్ 20 2026: పెద్దమందడి మండలంలోని మోజర్ల గ్రామానికి చెందిన గట్టు రమేష్ కుమారుడు గట్టు యువరాజ్ ఎంబీబీఎస్ సీటు సాధించిన సందర్భంగా అయ్యపురెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రోత్సాహక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వనపర్తి ప్రజావైద్యశాల డాక్టర్ మురళీధర్ చేతుల మీదుగా యువరాజ్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఫౌండేషన్ తరఫున పుస్తకాల కొనుగోలు కోసం రూ.10,000 నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యువరాజ్‌ను అభినందిస్తూ ఎంబీబీఎస్ విద్యను విజయవంతంగా పూర్తి చేసి భవిష్యత్తులో పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రోత్సాహం అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు అండగా నిలవడమే ఫౌండేషన్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

