పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 20 2026: పెద్దమందడి మండలం మోజర్ల గ్రామానికి చెందిన జక్కని ఆంజనేయులు–అర్చన దంపతుల కుమార్తె ఉమామహేశ్వరి పుట్టుచీర కార్యక్రమాన్ని ఆదివారం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు మోజర్ల గ్రామ సర్పంచ్ కే. చంద్రశేఖర్, పెద్దమందడి మాజీ ఎంపీపీ రఘుప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారి ఉమామహేశ్వరిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు చిన్నారి ఉమామహేశ్వరి ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఎదగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆర్. రాములు, 1వ వార్డు సభ్యుడు ఆర్. రాములు, 2వ వార్డు సభ్యుడు ఎస్. కృష్ణయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మద్దెల రామచంద్ర, జక్కని బాలరాజు, జక్కని అంజి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

