ePaper
Saturday, October 31, 2026
📄 ePaper

ఎల్‌నినో ప్రభావం – వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలి

📰 Generate e-Paper Clip

– కొత్తకోట మున్సిపాలిటీ చైర్‌పర్సన్
 అరుణా శ్రీనివాస్,

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్.31.2026.రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం  వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని  కొత్తకోట మున్సిపాలిటీ చైర్‌పర్సన్,అరుణా శ్రీనివాస్ అన్నారు.దేవరకద్ర శాసనసభ్యులు జి. మధుసూదన్ రెడ్డి  ఆదేశాల మేరకు శుక్రవారం కొత్తకోట మున్సిపాలిటీలో ఎల్‌నినో ప్రభావంరాబోయే వేసవిలో ఎదురయ్యే నీటికొరతనుదృష్టిలోఉంచుకొని ప్రత్యేకంగా మున్సిపల్ వార్డు కౌన్సిలర్లందరి అభిప్రాయాలు, సూచనల మేరకు ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, నీటి సంరక్షణకు పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని అన్నారు.ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సైదయ్య మాట్లాడుతూ

1. ఎల్‌నినో అంటే ఏమిటి?

పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వాతావరణంలో మార్పులు ఏర్పడటాన్ని ఎల్‌నినో అంటారు. దీని ప్రభావంతో మన ప్రాంతంలో వర్షాలు తగ్గే అవకాశం ఉంటుంది. వర్షాలు సరిగా పడకపోతే భూగర్భ జలాలు తగ్గి, తీవ్రమైన నీటి కొరతతో పాటు కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు.

2. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతలు తప్పనిసరి!

వర్షపు నీటిని వృథా చేయకుండా భూమిలోకి ఇంకేలా ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రస్తుతం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లతో పాటు, ఇప్పటికే ప్రొసీడింగ్స్ తీసుకొని నిర్మాణాలు చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్లలో కూడా ఇంకుడు గుంతల ఏర్పాటు తప్పనిసరి చేస్తున్నామని, దీనివల్ల భూగర్భ జలాలు పెంపొందించుకొని భవిష్యత్తులో నీటి కొరతను తగ్గించుకోవచ్చని అన్నారు.

3. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలి!

ప్రతి వార్డులో మున్సిపాలిటీ ద్వారా నీటి సరఫరా చేసే సమయాలను ప్రజలకు ముందుగానే తెలియజేయాలి. తద్వారా ప్రజలు ఆ సమయానికి అనుగుణంగా నీటిని నిల్వ చేసుకొని అవసరమైన మేరకు మాత్రమే వినియోగించుకోవాలి. ముఖ్యంగా నీటి కొరత ఉన్న ఈ పరిస్థితుల్లో కార్లు కడగడం, ఇతర అవసరాలకు నీటిని వృథా చేయడం పూర్తిగా నివారించాలని అన్నారు.

4. నీటి సౌకర్యం లేని ప్రాంతాలకు బోర్ల ఏర్పాటు చెయ్యాలి

కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలో నీటి సౌకర్యం సరిగా లేని వార్డులను గుర్తించి, అవసరమైన ప్రాంతాల్లో బోర్లు వేయడానికి అనుమతులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగిందని, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందని అన్నారు.

5. పశువుల కోసం నీటి తొట్టెల ఏర్పాటు చేసుకోవాలి

కొత్తకోట పట్టణ ప్రజలతో పాటు పశువుల నీటి అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. రాబోయే వేసవిలో పశువులకు కూడా నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున, అవసరమైన వార్డులు మరియు ప్రాంతాలను గుర్తించి అక్కడ పశువుల కోసం నీటి తొట్టెలు నిర్మించేలా సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగిందని,నీటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటేనే భవిష్యత్తులో నీటి ఎద్దడి, కరువు పరిస్థితులను ఎదుర్కోగలం. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ సమన్వయంతో పనిచేసి నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లవి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు ఎన్ జే.బోహెజ్, భీమా చంద్రకాంత్, రవీందర్ రెడ్డి, అబ్దుల్ నబీ, సుధా రామ్మోహన్ రెడ్డి, మురళి యాదవ్, డబ్బ సలీం, అయ్యన్న, ఎరుకల తిరుపతయ్య, జే. అఖిల తండ్రి సుభాష్, సంజీవుడు, సత్యం,మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు తయ్యబ్, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

గ్రామ గ్రామాన ఎర్ర జెండా ఎగరాలి

నవంబర్ 1 నుండి 9 వరకు నిర్వహించనున్న అమరవీరుల సంస్కరణ సభలో...

ప్రజల నాయకుడు వనమాకి జన్మదిన శుభాకాంక్షలు: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

అక్టోబర్ 31/10/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9...

శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి పుణ్యక్షేత్రం అభివృద్ధి ప్రదాత దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి 

–  శ్రీ శ్రీ కురుమూర్తి దేవస్థానం పాలకమండలి మాజీ డైరెక్టర్.బాదం వెంకటేశ్వర్లు, పొలిటికల్...

నాటు తుపాకులతో వన్యప్రాణుల వేటకు యత్నం.. ముగ్గురి అరెస్ట్

రెండు నాటు తుపాకులు, మందుగుండు సామగ్రి స్వాధీనంపొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి...

పేదోడి గుడిసెలో వెలుగు నింపాలని కరెంట్ డిపార్ట్మెంట్ ఎడిఇ కి కాలని ప్రజలు వినతిపత్రం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్.9 టివి న్యూస్...

అన్నపురెడ్డిపల్లిలో ప్రగతి పరుగులు.. దుమ్ము బాధలకు చరమగీతం!

  ● రూ. 5.80 కోట్లతో మండల కేంద్ర ప్రధాన రహదారికి మహర్దశ ●శరవేగంగా...

Related Articles

పేదోడి గుడిసెలో వెలుగు నింపాలని కరెంట్ డిపార్ట్మెంట్ ఎడిఇ కి కాలని ప్రజలు వినతిపత్రం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్.9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్.01.2026.వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ జయప్రకాష్ కాలనీలో బేడ బుడగ జంగాల గుడిసెలో విద్యుత్ ఆపివేతపై...

జిల్లాస్థాయిభజనపొటీలలోముమ్మళ్ళపల్లి గ్రామం శ్రీ గురు హరి భజన మండలి సభ్యులకు ప్రశాంశ పత్రలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్.01.2026. వనపర్తి పట్టణంలో జరుగుతున్న వికాస తరంగిణి ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని దాచా...

కళాకారులను కాపాదుకుందాం -పలుస శంకర్ గౌడ్

కళాకారుడు జయరామ్ ను పరామర్శించిన సాహితీ కళా వేదిక సభ్యులు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 30 2026:...
error: Content is protected !!