నవంబర్ 1 నుండి 9 వరకు నిర్వహించనున్న అమరవీరుల సంస్కరణ సభలో భాగంగా అన్ని గ్రామాలలో అమరవీరులకు నివాళులు అర్పిస్తూ గ్రామ గ్రామాన ఎర్రజెండాలు ఎగరవేయండి.
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండల ప్రతి నిధి:
సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పోట్ల రామ నర్సయ్య 50వ వర్ధంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలో జరిగే సభను జయప్రదం చేయండి. 1/11/2026న

నవంబర్ 1న మహబూబాబాద్ జిల్లా గార్ల మండలకేంద్రంతో పాటుసత్యనారాయణపురం, ముల్కనూరు, చిన్న కిస్టాపురం గ్రామాలలో అమరవీరుల సంస్కరణ సభల పోస్టర్ల ఆవిష్కరణ.
సీపీఐ యం యల్ న్యూ డెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా నాయకులు జడ సత్యనారాయణ, గార్ల మండల కార్యదర్శి జి సక్రు పోస్టర్ల ఆవిష్కరణ అనంతరం వారు మాట్లాడుతూ దోపిడి పీడన అసమానతలు లేని నూతన సమాజం కోసం భారత విప్లవ ఉద్యమంలో అనేకమంది అమరులు అయ్యారు. అన్నివారు ఆన్నారు, ఈ సందర్భంగా నవంబర్ 1 నుంచి 9 వరకు గ్రామ గ్రామాన సంస్కరణ సభలను నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు సూత్రపు మనోహర్, జడ ఐలమ్మ, మాలోత్ మాన్య, వాంకుడోత్ కొండయ్య, శ్రీను, పిడియస్ యు జిల్లా కార్యదర్శి బి మధు, పి ఓ డబ్ల్యు నాయకులు బి రాధ, ఎం భారతి, ఏఐకేఎంఎస్ నాయకులు వి సక్రు, జి రమణ, కె యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

