ePaper
Thursday, November 12, 2026
📄 ePaper

ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త బోర్ల ఏర్పాటుపై విధానపరమైన నిర్ణయం తీసుకుంది

📰 Generate e-Paper Clip

– ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నాo,

– దేవరకద్ర ఎమ్మెల్యే  జి. మధుసూదన్ రెడ్డి ,

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 13. 2026. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త బోర్ల ఏర్పాటుపై విధానపరమైన నిర్ణయం తీసుకుందని, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నామని  దేవరకద్ర ఎమ్మెల్యే  జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం దేవరకద్ర నియోజకవర్గం వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ అరుణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో  దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని  కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పట్టణంలోని పలు సమస్యలను ఎమ్మెల్యే  దృష్టికి తీసుకువచ్చారు.వారి సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే , ప్రతి అంశాన్ని నోట్ చేసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త బోర్ల ఏర్పాటుపై విధానపరమైన నిర్ణయం తీసుకుందని, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.నీటి లభ్యత ఉన్న ప్రాంతాల నుంచి పైప్‌లైన్ల ద్వారా నీటిని తరలించడం, అవసరమైన చోట ప్రైవేట్ బోర్లను అద్దెకు తీసుకొని వాటి ద్వారా నీటిని సరఫరా చేయడం వంటి చర్యలు చేపట్టాలని కమిషనర్ గారికి సూచించారు.నీటి సమస్య ఉన్న వార్డుల్లో మినీ ట్యాంకులు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.నీటి వృథాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, నీటిని వృథా చేసే వారిని ఉపేక్షించొద్దని, నీటిని వృథా చేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.ప్రజలకు తాగునీరు అందించడం అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశమని స్పష్టం చేశారు.వివర్స్ కాలనీలో విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు సంబంధించి, విద్యుత్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.పట్టణంలోని పలు కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, గత పాలకులు వాటిని పట్టించుకోలేదని అన్నారు.పలు కాలనీలలో అస్తవ్యస్తంగా ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించి, అధిక నిధులు కేటాయించి, వాటి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కొత్తకోటలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని పరిశీలించాలని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సూచించారు.ఎల్ నినో వంటి పరిస్థితులను రాజకీయాలకు ఉపయోగించకుండా, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అందరం కలిసి పనిచేద్దామనిఎమ్మెల్యేపిలుపునిచ్చారు. పట్టణంలోని డివైడర్లపై ఉన్న కోనోకార్పస్ చెట్లను తొలగించి, వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటడంతో పాటు అడ్వర్టైజ్మెంట్ కు సంబంధించి ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.కొత్తకోటలో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రిని సంక్రాంతి లేదా ఉగాది నాటికి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.రామాలయం వద్ద నెలకొన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.కొత్తకోట మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి తనవంతు పూర్తి సహకారం అందిస్తాననిఈసందర్భంగాతెలియజేశారు.అనంతరం 20 లక్షల రూపాయల నిధులతో కొత్తకోట బస్టాండ్ లో ఆస్పిరేషనల్ టాయిలెట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.తదనంతరం చెనగచెరువు కట్ట ఆధునికరణ పనుల పురోగతిని, క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సైదయ్య, వైస్ చైర్మన్ పల్లవి కృష్ణారెడ్డి,మున్సిపల్ కౌన్సిలర్సు పి.రవీందర్ రెడ్డి, జి. మురళి, కరాటే నభి, ఎం. తిరుపతి, మంజుల రామకృష్ణ, జె. అఖిల తండ్రి సుభాష్, పి. సత్యం సాగర్, భీమచంద్రకాంత్, ఎం. సంజీవులు, అజ్మత్ ఖాన్ సలీం ఖాన్,పి. సుధా రామ్మోహన్ రెడ్డి, ఎన్.అయ్యన్న,మున్సిపల్ కోఆప్షన్  సభ్యులు తయ్యబ్, ఎండి.ఆఫీస్, కొండారెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

ఎమ్మెల్యే మేఘారెడ్డి సహకారంతో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు

అల్వాల గ్రామంలో రెండో విడత లబ్ధిదారుల వెరిఫికేషన్ క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఇందిరమ్మ హౌసింగ్...

అల్వాలలో 30 మంది రైతుల పంట నష్టం పరిశీలన

ఎంఏఓ సైదులు యాదవ్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఏఈఓ సురేష్ కుమార్ ఎల్‌నినో...

Related Articles

అల్వాలలో 30 మంది రైతుల పంట నష్టం పరిశీలన

ఎంఏఓ సైదులు యాదవ్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఏఈఓ సురేష్ కుమార్ ఎల్‌నినో ప్రభావాలపై రైతులకు అవగాహన.. పంటల సంరక్షణకు పలు సూచనలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

బలిజపల్లిలో చోరీ.. బంగారు, వెండి ఆభరణాలు అపహరణ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ నవంబర్ 12 2026: పెద్దమందడి మండల పరిధిలోని బలిజపల్లి గ్రామంలో గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి...

రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైన మద్దిగట్ల–మోజర్ల విద్యార్థిని శ్రీవల్లి

విద్యార్థినిని అభినందించిన ఉపాధ్యాయ బృందం పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ నవంబర్ 12 2026: పెద్దమందడి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దిగట్ల–మోజర్లకు...
error: Content is protected !!