ePaper
Thursday, November 12, 2026
📄 ePaper

అల్వాలలో 30 మంది రైతుల పంట నష్టం పరిశీలన

📰 Generate e-Paper Clip

ఎంఏఓ సైదులు యాదవ్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఏఈఓ సురేష్ కుమార్

ఎల్‌నినో ప్రభావాలపై రైతులకు అవగాహన.. పంటల సంరక్షణకు పలు సూచనలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 12 2026: పెద్దమందడి మండలం అల్వాల గ్రామ పరిధిలో ఇటీవల పంట నష్టం జరిగిన రైతుల పొలాలను మండల వ్యవసాయ అధికారి (ఎంఏఓ) సైదులు యాదవ్ ఆదేశాల మేరకు ఏఈఓ సురేష్ కుమార్ బుధ, గురువారాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెండు రోజుల పాటు గ్రామంలో పర్యటించి సుమారు 30 మంది రైతులకు చెందిన పంటలను పరిశీలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రైతుల పొలాలను సందర్శించి పంటల పరిస్థితిని పరిశీలించడంతో పాటు, వర్షాలు మరియు ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి వివరాలను నమోదు చేశారు. పంట నష్టం వివరాలను సంబంధిత అధికారులకు నివేదించనున్నట్లు తెలిపారు. అలాగే ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గడం, వర్షాల విరామం పెరగడం వంటి వాతావరణ మార్పులు వ్యవసాయంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, నేలలో తేమను కాపాడుకునే పద్ధతులు పాటించాలని, వాతావరణ పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయ పనులు చేపట్టాలని సూచించారు. పంటల్లో తెగుళ్లు, చీడపీడలు కనిపించిన వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించి తగిన సలహాలు తీసుకోవాలని రైతులకు సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తూ పంటలను సంరక్షించుకోవాలని ఏఈఓ సురేష్ కుమార్ రైతులకు అవగాహన కల్పించారు.

Latest Articles

ఎమ్మెల్యే మేఘారెడ్డి సహకారంతో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు

అల్వాల గ్రామంలో రెండో విడత లబ్ధిదారుల వెరిఫికేషన్ క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఇందిరమ్మ హౌసింగ్...

ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త బోర్ల ఏర్పాటుపై విధానపరమైన నిర్ణయం తీసుకుంది

– ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని...

Related Articles

ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త బోర్ల ఏర్పాటుపై విధానపరమైన నిర్ణయం తీసుకుంది

– ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నాo,– దేవరకద్ర ఎమ్మెల్యే  జి. మధుసూదన్ రెడ్డి ,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9...

బలిజపల్లిలో చోరీ.. బంగారు, వెండి ఆభరణాలు అపహరణ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ నవంబర్ 12 2026: పెద్దమందడి మండల పరిధిలోని బలిజపల్లి గ్రామంలో గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి...

రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైన మద్దిగట్ల–మోజర్ల విద్యార్థిని శ్రీవల్లి

విద్యార్థినిని అభినందించిన ఉపాధ్యాయ బృందం పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ నవంబర్ 12 2026: పెద్దమందడి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దిగట్ల–మోజర్లకు...
error: Content is protected !!