– బిసి. సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జి. యుగంధర్ యాదవ్,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్ ఆగస్టు 23.2026.తెలంగాణ రాష్ట్రములో వివిధ సంక్షేమ శాఖలైనటువంటి ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనార్టీల కులాలకు చెందిన ప్రభుత్వ సంక్షేమ శాఖాలకుసంబంధితకులాలవారినిమాత్రమేనియమించాలని బి.సి.సంక్షేమసంఘంఉమ్మడిపాలమూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జి. యుగంధర్ యాదవ్ శనివారం ఒక ప్రకటనలోప్రభుత్వ పాలకులకు విజ్ఞప్తి చేశారు. ఎస్.సి. సంక్షేమ శాఖ లో కేవలం ఎస్. సి. కులాల వారిని, ఎస్. టి. సంక్షేమ శాఖలో కూడా కేవలం ఎస్. టి. కులాల వారిని, ఆదే మదరిగా బి.సి. సంక్షేమ శాఖలో కూడా బి.సి. కులాల వారిని, ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖలో కేవలం ముస్లిమ్ కులాల వారినిమాత్రమేతెలంగాణరాష్ట్రప్రభుత్వంనియమించి అట్టి నాలుగు వర్గాలకు న్యాయం చేయాలని ఈ సందర్బంగాఆయనకోరారు.విద్యపరంగాఎన్నోఉన్నత విద్యలు అభ్యాసించి రాణించారని, తెలంగాణ రాష్ట్ర అప్పటి, మరియు ఇప్పటి ప్రభుత్వాలు మాత్రం ఇందుకు వ్యతిరేకంగా ( భిన్నంగా) రెడ్లు, దొరల కులాలకు చెందిన వారిని నియమించి, నాలుగు వర్గాల కులాలకు చెందిన వారిని మోసలకు గురి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్,ప్రభుత్వంప్రజలప్రభుత్వంఅనిచెప్పుకుంటున్న రేవంత్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల కులాల వారి జీవితాల్లో వెలుగులు నింపాలని జి. యుగంధర్ యాదవ్ కోరారు.

