వెంటనే స్పందించిన వైస్ చైర్మన్ జూపల్లి రమేష్‌బాబు
అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ వడితే గణేష్ ఆగష్ట 22 2026: అశ్వారావుపేట ప్రజలను ఏళ్లుగా ఇబ్బందులకు గురిచేస్తున్న విద్యుత్ సమస్యపై మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్‌బాబు స్పందించి తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టారు. సంబంధిత విద్యుత్ శాఖ ఏఈతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ప్రజలకు ఎదురయ్యే సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కారం చూపడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. కార్యక్రమంలో యువ నాయకుడు జూపల్లి ప్రమోద్, 10వ వార్డు కౌన్సిలర్ మిండా హరిబాబు, 15 వ వార్డ్ కౌన్సిలర్ మోర్ల వెంకన్న,14వ వార్డు కౌన్సిలర్ డాక్టర్ భూక్యా ఉదయజ్యోతి, బాబీ, శ్రీను, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


