మహిళా సిబ్బందికి చీరలు, పసుపు కుంకుమ బహూకరణ
అల్పాహారం ఏర్పాటు చేసిన జూపల్లి శశికళమ్మ, జూపల్లి రమేష్ బాబు
పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్లు

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ (వడితే గణేష్ ఆగష్ట 22 2026: అశ్వారావుపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ జూపల్లి శశికళమ్మ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు నివాసంలో వరలక్ష్మీ వ్రత వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాస పవిత్రతను చాటేలా సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకల్లో మున్సిపాలిటీ మహిళా సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూపల్లి శశికళమ్మ, జూపల్లి రమేష్ బాబు మహిళా సిబ్బందికి చీరలతో పాటు పసుపు, కుంకుమలను బహూకరించారు. అనంతరం వారికి అల్పాహారం ఏర్పాటు చేసి, సిబ్బందితో కలిసి ఆత్మీయంగా పండుగను జరుపుకున్నారు. వరలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మంగళహారతులు సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొని మహిళా సిబ్బందికి వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు తెలిపారు. జూపల్లి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు ఆధ్యాత్మిక శోభతో, ఆత్మీయ వాతావరణంలో సాగాయి.



