
కదిరి: పొలిటికల్ పవర్ ప్రతినిధి నాగరాజు రెడ్డి
కదిరి రాజకీయ క్షేత్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం సరికొత్త వేడిని రగిలిస్తోంది. వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బి.ఎస్. మక్బుల్ నేతృత్వంలో కేడర్ జనాల్లోకి దూసుకెళ్తోంది. మున్సిపల్ ఎన్నికల వేళ కదిరి మున్సిపాలిటీ పరిధిలోని కూరగాయల మార్కెట్, రైతు బజార్, జీవిమాను సర్కిల్ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహించి ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసిరారు.
ప్రజలతో ఆత్మీయ మమేకం – ‘ఫ్యాన్’ గుర్తుకే ఓటు జపం
స్థానిక వ్యాపారులు, వీధి వ్యాపారులు, సామాన్య ప్రజలను నేరుగా కలుస్తూ మక్బుల్ ఎలక్షన్ హీట్‌ను పెంచేశారు. నవంబర్ 1న జరగనున్న పోలింగ్‌లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అత్తార్ పర్వీన్తో పాటు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రచారంలో భాగంగా ప్రతి షాపునూ, ప్రతి నివాసాన్ని తాకుతూ ఊపు తెచ్చారు.
హేమాహేమీల దండయాత్ర!
ఈ మాస్ ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా, రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి సాధత్ అలీ ఖాన్ తో పాటు వైఎస్సార్‌సీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని తమ బలాన్ని చాటారు. గులాబీ, నీలం జెండాల హోరుతో కదిరి వీధులు మార్మోగాయి. వైఎస్సార్‌సీపీ వేసిన ఈ రాజకీయ ఎత్తుగడతో ప్రత్యర్థి శిబిరాల్లో గుబులు మొదలైంది!

