

చిలకలూరిపేట:పొలిటికల్ పవర్ ప్రతినిధి
చిలకలూరిపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కదనరంగంలోకి దూకింది. 4, 5, 6, 10, 33, 43, 47 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మాజీ మంత్రి విడదల రజిని నిర్వహించిన ప్రచారం ప్రజల్లో కొత్త శోభను, ఊపును నింపింది. వీధి వీధినా సాగిన ఈ పాదయాత్రకు జనప్రభంజనం తోడై, కూటమి ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది!
నెరవేర్చిన హామీలే మన పార్టీ శ్రీరామరక్ష!
ప్రచారంలో భాగంగా రజిని మాట్లాడుతూ… వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రతి వార్డులోనూ విప్లవాత్మక అభివృద్ధి జరిగిందని, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుని సంక్షేమ ఫలాలను నేరుగా ఇంటింటికీ అందించామని గుర్తుచేశారు. కానీ, నేడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి ప్రజలను దారుణంగా మోసం చేసిందని మండిపడ్డారు. మాట తప్పే కూటమి తీరుకు, మాట నిలబెట్టుకునే వైఎస్సార్‌సీపీ నైజానికి వ్యత్యాసాన్ని ఓటర్లు గమనించాలని సూచించారు.
తరలివస్తున్న నమ్మకం – ఫ్యాన్ గుర్తుకే ప్రజా మద్దతు!
“మీ పిల్లల భవిష్యత్తు, మన ఊరి సమగ్ర అభివృద్ధి, సంక్షేమ పాలన నిరంతరం సాగాలంటే వైఎస్సార్‌సీపీ గెలవడం అత్యంత ఆవశ్యకం” అని రజిని తేల్చిచెప్పారు. నవంబర్ 1న జరగబోయే మున్సిపల్ పోరులో… ప్రతి ఓటరూ ఆలోచించి, ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
కూటమి అబద్ధాలను పటాపంచలు చేస్తూ, సంక్షేమం మరియు అభివృద్ధి వైపే చిలకలూరిపేట ప్రజలు నిలబడబోతున్నారని ఈ భారీ ప్రజా మద్దతు స్పష్టం చేస్తోంది!

