పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవి తెలుగు న్యూస్ రిపోర్టర్. ఎం .ప్రసాద్ రావు. కలసపాడు. కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గంలోని కలసపాడుమండలం లో బంద్ ప్రశాంతంగా ముగిసిందని, మండల ఎస్ .ఎఫ్. ఐ . నాయకులు రమణ తెలిపారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన, బంద్ లో భాగంగా కలసపాడు మండలంలోని స్థానిక సెయింట్ ఆంటోనీస్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల విద్యార్థిని, విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి వైయస్సార్ సర్కిల్ వద్ద మానవహారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం కేంద్ర ప్రభుత్వాలకు తగదని నీట్ పేపర్ లీకేజ్ లో సంబంధించిన మంత్రులు వెంటనే రాజీనామాలు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఏ స్థాయిలో ఉన్న రాజీనామాలుచెయ్యని యెడల తీవ్ర స్థాయిలో ఉద్యమాలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ల, కాసినాయన, కలసపాడు, మండల ఎస్.ఎఫ్.ఐ. నాయకులు పాల్గొన్నారు.
