రైతులంతా రైతు ఐడి పొందాలి..

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంబిక్కవోలు మండలం కాపవరం, బలభద్రపురం గ్రామాల్లో ఈరోజుపొలంపిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బిక్కవోలు మండల వ్యవసాయ అధికారి జి. వాణి మాట్లాడుతూ రైతులందరూ తమ పొలాలను ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రేషన్‌లో నమోదు చేసుకుని రైతు గుర్తింపు కార్డు పొందాలని సూచించారు. భవిష్యత్తులో ఎరువుల విక్రయాలు, ధాన్యం కొనుగోళ్లకు రైతు గుర్తింపు కార్డు తప్పనిసరి కానుందని తెలిపారు.
ప్రతి రైతు సేవా కేంద్రంలో పంటల నమోదు ప్రక్రియ జరుగుతోందని, రైతులందరూ తమ పంట నమోదుకు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. పంట వివరాలు తప్పుగా నమోదై ఉంటే వెంటనే సరిచేయించుకోవాలని తెలిపారు.అనంతరం గ్రామాల్లో ప్రస్తుత పంటల పరిస్థితిపై రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి కోన శ్రీనివాసు, గ్రామీణ ఉద్యానవన అధికారులు శ్రీనివాస్, శరత్, గ్రామ వ్యవసాయ సహాయకురాలు శిరీషతో పాటు కాపవరం, బలభద్రపురం గ్రామాల రైతులు పాల్గొన్నారు.
