ePaper
Friday, August 28, 2026
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్కులమతాలకు ప్రతీక రాఖీ పండగ: గుండా నిరంజన్ 

కులమతాలకు ప్రతీక రాఖీ పండగ: గుండా నిరంజన్ 

📰 Generate e-Paper Clip

గుండా నిరంజన్ కు రాఖీ కట్టిన మల్కాజ్గిరి మహిళా కాంగ్రెస్ అక్క చెల్లెలు….

అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల ఆప్యాయతే రక్షాబంధన్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలంగాణ స్టేట్ క్రైమ్ బ్యూరో మహేందర్ యాదవ్ ల్కాజిగిరి, ఆగస్టు 28, : కులమతాలకు ప్రతీక రాఖీ పండగ అని మల్కాజిగిరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మీడియా కన్వీనర్ గుండా నిరంజన్ అన్నారు. శుక్రవారం రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని మల్కాజిగిరి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆశ ఆధ్వర్యంలో గుండా నిరంజన్ కు రాఖీలు కట్టారు. మహిళా కాంగ్రెస్ లో ముస్లింలు కూడా రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొని రాఖీలు కట్టి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా గుండా నిరంజన్ మాట్లాడుతూ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ పండుగ ఎంతో పవిత్రంగా జరుపుకుంటామని అక్క తమ్ముళ్ల, అన్నాచెల్లెళ్ల ఆప్యాయత, అనురాగానికి రక్షాబంధన్ ప్రతీక అని కొనియాడారు. రక్షాబంధన్ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు యూసుఫ్, మల్కాజ్గిరి మహిళా కాంగ్రెస్ నాయకురాలు భాగ్యలక్ష్మి జన, చైతన్య, చిన్న రాణి, రోజా రమణి, జిన్ని, మహాలక్ష్మి అనిత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!