ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తికులాల పేర్లతో అవమానపరిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు

కులాల పేర్లతో అవమానపరిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు

📰 Generate e-Paper Clip

అల్వల లో పౌర హక్కుల ప్రాముఖ్యతపై అవగాహన

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 31 2026: ప్రతి ప్రతి పౌరుడు తన హక్కులతో పాటు బాధ్యతలను కూడా సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ఆర్ఐ గణేష్ మాట్లాడుతూ… అందరూ సమానత్వంతో ఎదగాలి కులాల పేర్లతో అవమానపరిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదవుతాయి అని అందరూ సమన్యాయంతో ఉండాలి అని విజ్ఞప్తి చేశారు. శనివారం పెద్దమందడి మండలంలో అల్వల గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో పౌర హక్కుల దినం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎఎస్ఐ శ్రీనివాస్ శర్మ ఈ సందర్భంగా ప్రజలకు పౌర హక్కుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ చట్టాలపై కీలక సూచనలు చేస్తూ భారత రాజ్యాంగ ప్రకారం అందరూ సమానమేనని ఎవరినైనా దేవాలయాలకు రానీయకుండా ఉంటే అవమానపరిచినట్లు, కించపరిచినట్లయితే, కులం హేతరమైన ఎలాంటి చర్యలకు పాల్పడితే అలాంటి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు అవుతావని వారు అన్నారు. స్వేచ్ఛాయుతంగా భావంతో అందరు కలిసి సమానంగా ఉండాలని సూచించారు. ప్రతి పౌరుడు తన హక్కుల తో పాటు బాధ్యతలను కూడా తెలుసుకొని సమాజ అభివృద్ధికి సహకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజామహేందర్ రెడ్డి, సెక్రటరీ శోభారాణి, ఉప సర్పంచ్ సుజాత భీమన్న యాదవ్, వార్డు మెంబర్లు వెంకట్ రాములు, జానకమ్మ, శేఖర్, వెంకట్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!