ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్కేపిహెచ్ బి 9వ ఫేస్ లో ఘనంగా డా. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ...

కేపిహెచ్ బి 9వ ఫేస్ లో ఘనంగా డా. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

– నాయకుడు మరణించినా.. ప్రజల గుండెల్లో జీవించి ఉండటానికి నిలువెత్తు సాక్ష్యం వైయస్‌ఆర్ : కరుమూరి వెంకట్ రెడ్డి – వైయస్ రాజశేఖర్ రెడ్డి ఒక బ్రాండ్: కొండ రాజీవ్

పొలిటికల్ పవర్ సామాగ్ర తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కూకట్ పల్లి: ప్రతినిధి హేమంత్ సాగర్ జులై 09 2026: తెలుగునాట రాజకీయాలు ఉన్నంత కాలం వైయస్‌ఆర్ ముద్ర సజీవంగా ఉంటుందని, నాయకుడు మరణించినా.. ప్రజల గుండెల్లో జీవించి ఉండటానికి నిలువెత్తు సాక్ష్యం వైయస్‌ రాజశేఖర్ రెడ్డి అని వై ఎస్ ఆర్ సి పి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి కరుమూరి వెంకట్ రెడ్డి అని అన్నారు. కూకట్పల్లి కెపిహెచ్బి కాలనీ, 9వ ఫేస్ వద్ద వైయస్సార్ అభిమానులు సూర్య ఉదయం తెలుగు దినపత్రిక తెలంగాణ ఎడిటర్ భాష, శ్రీకాంత్ రెడ్డి, అరుణ రెడ్డి, లక్ష్మీరెడ్డి లు ఏర్పాటు చేసిన 77వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి కరుమూరి వెంకటరెడ్డి, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కొండ రాజీవ్, కడప జిల్లా ఉపాధ్యక్షులు డివి శశికాంత్ రెడ్డి, స్థానిక వైయస్సార్ అభిమానులతో కలిసి డాక్టర్ వైయస్సార్ చిత్రపటానికి పూలు మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జై వైయస్సార్ జై జై వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులకు సూర్య ఉదయం తెలంగాణ ఎడిటర్ భాష, హాస్టల్ అసోసియేషన్ సభ్యులు అరుణ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందించారు. ఈ సందర్భంగా కరుమూరి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… వైయస్సార్ పేద ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత. ఈరోజు పార్టీలకు అతీతంగా వైయస్సార్ అభిమానులుగా ఎంతోమంది నాయకులు ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నేళ్లు బతికామని కాదు ప్రజలకు ఎంత మంచి పనులు చేశాము అన్నదే ముఖ్యమంటూ ఒక సరికొత్త అధ్యయనం సృష్టించారు. వైయస్సార్ పేద ప్రజలకు సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారు 108, 104, ఆరోగ్యశ్రీ డ్వాక్రా రుణమాఫీ, రైతులకు ఉచిత విద్యుత్తు, రైతుల రుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంట్ ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అనడంలో అతిశయోక్తి లేదన్నారు. యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆయన అన్నారు. అనంతరం అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కొండ రాజీవ్ మాట్లాడుతూ కుకట్పల్లి గడ్డ వైయస్సార్ అడ్డా అన్న రీతిలో జయంతి వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉన్నాను. ఆయన పాలనకు ఆయన చేసిన మంచికి ప్రజల గుండెల్లో వైయస్సార్ దేవుడు లా ఉన్నాడు అని చెప్పడానికి నిదర్శనంగా ఇక్కడ కుల మతాలకు, పార్టీలకు అతీతంగా మహిళలు, వృద్ధులు, విద్యార్థులు అందరూ ముందుకు వచ్చి జోహార్ వైయస్ఆర్ అంటూ జయంతి వేడుకలు చేశారు. వారందరికీ కృతజ్ఞతలు. వైఎస్ఆర్ అంటే ఒక బ్రాండ్ అని ఆయన మన మధ్య లేకున్నా కానీ ఆయనపై మనకున్న ప్రేమ అనేది చావలేదు ఆయన ఆశయాలు మనం అందరం ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. అనంతరం కెపిహెచ్బి కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అరవింద్ రెడ్డి, బాలాజీ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేష్ గౌడ్ లు పాల్గొని వైయస్సార్ కు నివాళులర్పించారు. అనంతరం బండి మధుసూదన్ రెడ్డి శివారెడ్డి, ఉపేందర్ రెడ్డి, జీఎల్ఎన్ రెడ్డి లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధి గురించి, పాలన గురించి నేటికీ ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారు. ఆయన ఏ కార్యక్రమం తలపెట్టినా పేదలకు ఉపయోగపడాలనే తాపత్రయం ఉండేది. వైయస్ఆర్ చేసిన మంచిని ప్రజలు ఏ రోజూ మర్చిపోలేరు అని అన్నారు. సూర్య ఉదయం పత్రిక తెలంగాణ ఎడిటర్ భాష మాట్లాడుతూ పేదల సంక్షేమానికి, రైతుల అభ్యున్నతికి, ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, రాష్ట్రాలకు సాగునీటి ప్రాజెక్టులు ఇంకా అనేక రంగాల్లో మహానేత వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రజల కోసం ఆలోచించిన నాయకుడిగా, ప్రజల హృదయాల్లో నిలిచిన మహానేతగా వైఎస్సార్ ఎప్పటికీ స్ఫూర్తిదాయకుడని అన్నారు. అనంతరం వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న వితరణ చేశారు. ఈ జయంతి వేడుకల్లో వైయస్సార్ అభిమానులు గాలి రెడ్డి, తులసి రెడ్డి, సాయినాథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, చెన్నారెడ్డి, ఆది రెడ్డి, రమణ రెడ్డి, కొండల్ రావు, స్థానిక విలేకరులు శ్యాంసుందర్, క్రాంతికుమార్, సోమిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సునీల్ కుమార్, చందు, కాలనీ వాసులు, వైయస్సార్ అభిమానులు, వైయస్ జగన్ అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!