ePaper
Tuesday, September 8, 2026
📄 ePaper
Homeతెలంగాణరామ్ కృష్ణ గుప్తా జన్మదిన వేడుకల్లో అన్నదానం

రామ్ కృష్ణ గుప్తా జన్మదిన వేడుకల్లో అన్నదానం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కూకట్ పల్లి ప్రతినిధి సెప్టెంబర్ 07 2026: కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీలోని 246వ డివిజన్ బీజేపీ సెక్రటరీ రామ్ కృష్ణ గుప్తా జన్మదినం సందర్భంగా పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలు, నిరుపేదలకు భోజనం అందించారు. జన్మదిన వేడుకలను సామాజిక సేవా కార్యక్రమంగా నిర్వహిస్తూ అన్నదానం చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. రామ్ కృష్ణ గుప్తా మాట్లాడుతూ, తన జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు అన్నదానం చేయడం ఎంతో సంతోషంగా ఉందని, భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని రామ్ కృష్ణ గుప్తాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!