ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తికొత్తకోట నూతన సబ్ఇన్‌స్పెక్టర్‌గా ఎం.విక్రమ్ బాధ్యతల స్వీకరణ

కొత్తకోట నూతన సబ్ఇన్‌స్పెక్టర్‌గా ఎం.విక్రమ్ బాధ్యతల స్వీకరణ

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 03.2026.
వనపర్తి జిల్లా కొత్తకోట పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా ఎం.విక్రమ్ సోమవారంబాధ్యతలుస్వీకరించారు.ఇతనునారాయణపెటజిల్లామరికల్,పోలీస్,స్టేషన్‌లోసబ్ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించినఆయనబదిలీపైకొత్తకోటకువచ్చారు.ఇప్పటివరకుకొత్తకోటసబ్ఇన్‌స్పెక్టర్‌గా సేవలందించిన సదాశివానంద్ గౌడ్ బదిలీపైఇతరప్రాంతానికివెళ్లడంతోఆయన స్థానంలోఎం.విక్రమ్,నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పోలీస్,స్టేషన్,సిబ్బందినూతనసబ్ఇన్‌స్పెక్టర్‌ కి పుష్పగుచ్ఛంఅందించిశుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎం.విక్రమ్ మాట్లాడుతూ ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. నేరాల నియంత్రణ, మహిళల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజల ఫిర్యాదుల సత్వర పరిష్కారం పై ప్రత్యేకదృష్టి సారిస్తామనితెలిపారు.పోలీసు,ప్రజలసమన్వయంతోసమర్థవంతమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని, ఏవైనా అనుమానాస్పదసంఘటనలుగమనించిన వెంటనేపోలీసులకుసమాచారంఅందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!