పార్కలగండి సర్పంచ్ కొమరం సుశీలకు ఘన సన్మానం
పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20: దమ్మపేట మండలం కొత్తూరు గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్కలగండి సర్పంచ్ కొమరం సుశీల పాల్గొన్నారు, వారితో పాటు మాజీ సర్పంచ్ కోర్స సాగర్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన సర్పంచ్ కొమరం సుశీలను కొత్తూరు యూత్ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యూత్ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


