
– పారదర్శకమైన విధానాలు ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*
హైదరాబాద్: అవుట్‌డోర్ అడ్వర్టైజింగ్ రంగంలో చట్టబద్ధమైన, నిబద్ధతతో కూడిన వ్యాపార అవకాశాల కోసం గత మూడేళ్లుగా తాను ప్రయత్నిస్తున్నట్లు ‘మిధునా యాడ్స్’ (హైదరాబాద్) యజమానురాలు కే. శోభా రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రికి తన ఆవేదనను వెలిబుచ్చారు.
తాజాగా రెవెన్యూ-షేరింగ్ ప్రతిపాదనలు సమర్పించినప్పటికీ, కొన్ని ప్రకటనల నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయని, G.O.Ms.No.68 కింద కొన్ని చోట్ల మినహాయింపులు ఇస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం దృష్టికి తన సమస్యను తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా కొందరిని సంప్రదించగా, గెస్ట్ హౌస్‌కు రావాలని అనడం పట్ల ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఏ వ్యక్తిపై వ్యక్తిగత విమర్శలు చేయడం తన ఉద్దేశం కాదని, కేవలం ఒక మహిళా పారిశ్రామికవేత్తగా చట్టబద్ధమైన వ్యాపార అవకాశాలు, పారదర్శకమైన పద్ధతులు మాత్రమే కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. తనకు ఎలాంటి ప్రత్యేక రాయితీలు అక్కర్లేదని, కేవలం సమాన అవకాశాలు కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.

