ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కొమరిపాలెంలో “యూత్ కనెక్ట్” కార్యక్రమం – యువతకు మార్గదర్శనం

కొమరిపాలెంలో “యూత్ కనెక్ట్” కార్యక్రమం – యువతకు మార్గదర్శనం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే 03:

తూర్పుగోదావరిజీల్లా బిక్కవోలు  మండలం కొమరిపాలెం గ్రామంలో ఆదివారం  సాయంత్రం పంచాయతీ కార్యాలయం వద్ద “యూత్ కనెక్ట్ ప్రోగ్రామ్” సమావేశం నిర్వహించారు. రాత్రి 7.00 గంటల నుండి 8.20 గంటల వరకు జరిగిన ఈ సమావేశాన్ని బిక్కవోలు ఎస్సై వి. రవిచంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, సమాజానికి ఉపయోగపడే దిశగా ముందుకు సాగాలని అవగాహన కల్పించడం. ముఖ్యంగా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నుండి యువత దూరంగా ఉండాలని పోలీస్ అధికారులు సూచించారు. సమాజ అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.
ఈ సమావేశానికి రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డిఎస్పి బి. విద్యా, అనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ వి.ఎల్.వి.కె. సుమంత్ ముఖ్య అతిథులుగా హాజరై యువతను ఉద్దేశించి ప్రసంగించారు. మంచి మార్గాన్ని ఎంచుకుని భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.
బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో తొలి కార్యక్రమంగా కొమరిపాలెం గ్రామంలో ఈ సమావేశాన్ని నిర్వహించగా, గ్రామానికి చెందిన ప్రముఖులు మరియు యువకులు కలిపి సుమారు 200 మంది పాల్గొన్నారు.

 

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!