ePaper
Wednesday, October 28, 2026
📄 ePaper

క్రీడలతో పాటు విద్యలోనూ యువత రాణించాలి: సోయం వీరభద్రం

📰 Generate e-Paper Clip

లచ్చాపురం వాలీబాల్‌ టోర్నమెంట్‌లో విజేతలకు బహుమతుల ప్రదానం

పొలిటికల్ పవర్,దమ్మపేట, అక్టోబర్‌ 19: యువత క్రీడలతో పాటు విద్యలోనూ రాణించి, తమ ప్రతిభతో గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని బీఆర్‌ఎస్‌ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు సోయం వీరభద్రం అన్నారు. దమ్మపేట మండలం లచ్చాపురం గ్రామంలో డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ యూత్‌ కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న వాలీబాల్‌ టోర్నమెంట్‌ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా టోర్నమెంట్‌లో మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.8,116 నగదు బహుమతిని సోయం వీరభద్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు రెండింటినీ సమానంగా స్వీకరించాలని సూచించారు. ఓటమి ఎదురైనప్పుడు నిరుత్సాహపడకుండా, దానిని పాఠంగా తీసుకుని మరింత పట్టుదలతో ముందుకు సాగాలని అన్నారు.

క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐకమత్యం, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడలకు కూడా సమయం కేటాయిస్తూ తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని యువతకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా పోటీల నిర్వహణ యువతలో ప్రతిభను వెలికితీయడానికి దోహదపడుతుందని తెలిపారు.

కార్యక్రమానికి హాజరైన సోయం వీరభద్రంను టోర్నమెంట్‌ నిర్వాహకులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను, పోటీలను విజయవంతంగా నిర్వహించిన అంబేద్కర్‌ యూత్‌ కమిటీ సభ్యులను పలువురు అభినందించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, అంకథ ఉమామహేశ్వరరావు, కునుసోత్‌ రూప్‌సింగ్‌, తిరువీధుల జేమ్స్‌, యార్లగడ్డ శ్రీనివాసరావు, గద్దాల సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

తెలంగాణను పదేళ్లు దోచుకున్న బీఆర్ఎస్‌ నేతలకు ఇప్పుడు కరువు గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది?

– కాళేశ్వరం పేరుతో లక్షల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి, నేడు...

అశ్వారావుపేట 15వ వార్డులో అభివృద్ధికి మరో ముందడుగు!  పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట...

అనారోగ్యంతో యువకుని ఆత్మహత్య అక్టోబర్ 28 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ...

అంగన్వాడి విద్యార్థి పాముకాటుతో మృతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?వంతెన ,రోడ్డు నిర్మాణ పనులను తక్షణమే...

Related Articles

వాల్మీకి జయంతికి ఎమ్మెల్యే జారె ఆర్థిక చేయూత!

ఆలయ మరమ్మతులకు రూ.20 వేల సాయం.. తూర్పు బజార్‌లో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్...

వినాయకపురంలో మట్టి తవ్వకాలపై విచారణ జరపాలి!

అనుమతులపై స్పష్టత ఏదీ? అక్రమ తవ్వకాల ఆరోపణలపై అధికారుల స్పందన ఏది? పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ వడితే గణేష్ అక్టోబర్...

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఎమ్మెల్యే మట్టా రాగమయి ఘన సన్మానం!

యువత భవిష్యత్తే లక్ష్యం.. సోషల్ మీడియాతో సామాజిక చైతన్యానికి పిలుపు! పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ వడితే గణేష్ అక్టోబర్ 27...
error: Content is protected !!