ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఖిల్లా ఘనపూర్ ఎస్టీ ఆశ్రమ పాఠశాలను సందర్శించిన గిరిజన విద్యార్థి సంఘం నాయకులు

ఖిల్లా ఘనపూర్ ఎస్టీ ఆశ్రమ పాఠశాలను సందర్శించిన గిరిజన విద్యార్థి సంఘం నాయకులు

📰 Generate e-Paper Clip

–విద్యార్థులతో మమేకమైన సర్పంచ్ తనయుడు ఆగారం ప్రకాష్

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 25 2026: ఖిల్లా ఘనపూర్ మండల కేంద్రంలోని ఎస్టీ ఆశ్రమ పాఠశాలను శనివారం రోజు గిరిజన విద్యార్థి సంఘం (GVS) నాయకులు సందర్శించారు. ఈ బృందంలో రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయక్, జీవీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు ఎల్‌హెచ్‌పీఎస్ నేషనల్ ప్రెసిడెంట్ గణేష్ నాయక్, జీవీఎస్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్ బంజారా, జీవీఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాన్ శీను, నారాయణపేట జిల్లా జీవీఎస్ అధ్యక్షుడు గోపాల్ నాయక్, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు మరియు జీవీఎస్ రాష్ట్ర కార్యదర్శి రవీందర్ నాయక్ పాల్గొన్నారు. గిరిజన నాయకులు ఆశ్రమ పాఠశాలకు వచ్చిన విషయం తెలుసుకున్న వెంటనే ఖిల్లా ఘనపూర్ గ్రామ సర్పంచ్ ఆగారం పద్మమ్మ తనయుడు, మండల నాయకుడు ఆగారం ప్రకాష్ అక్కడికి చేరుకుని నాయకులతో కలిసి పాఠశాల పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడిన గిరిజన నాయకులు ప్రస్తుతం ప్రధానోపాధ్యాయులు (HM) సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ విద్యార్థుల విద్య, సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని విద్యార్థుల తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందిస్తున్నారని, విద్యార్థులను మంచి పద్ధతిలో చూసుకుంటున్నారని వారు పేర్కొన్నారు. విద్యార్థులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ప్రస్తుతం ఉన్న హెచ్‌ఎమ్ తమను బాగా చూసుకుంటున్నారని, చదువుతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని, తమకు ఇదే హెచ్‌ఎమ్ కొనసాగాలని కోరారు. ఆగారం ప్రకాష్ విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు హాస్టల్‌లో ప్రస్తుతం మంచి వాతావరణం ఉందని, నాణ్యమైన ఆహారం అందుతోందని ఆయనకు తెలిపారు. అనంతరం హాస్టల్ సిబ్బందితో కూడా ఆగారం ప్రకాష్ సమావేశమయ్యారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం హాస్టల్‌లో వసతులు మెరుగుపడుతున్నాయని, విద్యార్థులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి జరుగుతోందని సిబ్బంది వివరించారు. మరియు విద్యార్థులతో కలిసి శనివారం రోజు ఆశ్రమ పాఠశాలలోనే పిల్లలతో పాటు కూర్చుని భోజనం చేయడం జరిగింది. అక్కడ ఉన్న వసతులను కిచెన్ రూమ్ వాతావరణాన్ని ప్రతిదీ పర్యవేక్షించి విద్యార్థులకు అందుతున్న ఆహార నాణ్యతను విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది. విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధి కోసం ఎస్టీ ఆశ్రమ పాఠశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటానని ఆగారం ప్రకాష్ హామీ ఇచ్చారు. గిరిజన నాయకులు ఇలా తప్పుడు సమాచారం అందుకుని పాఠశాల సిబ్బందిని ఇబ్బంది పెట్టడం సరికాదని వారికి కోరడం జరిగింది. ఈ కార్యక్రమం లో మండల నాయకులు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!