ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిగురువులను ఘనంగా సన్మానించిన బీజేపీ ఎండోమెంట్ సెల్ జాయింట్ కన్వీనర్

గురువులను ఘనంగా సన్మానించిన బీజేపీ ఎండోమెంట్ సెల్ జాయింట్ కన్వీనర్

📰 Generate e-Paper Clip

-కొత్తకోట స్వాతి విటల్ రెడ్డిగురువులను సన్మానిస్తున్న కొత్తకోట స్వాతి విటల్ రెడ్డి

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో కొత్తకోట, ఆగస్టు 01 2026: గురుపౌర్ణమి సందర్భంగా కొత్తకోట పట్టణంలోని పలువురు గురువులను భారతీయ జనతా పార్టీ ఎండోమెంట్ సెల్ ఆధ్వర్యంలో ఆత్మీయంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎండోమెంట్ సెల్ జాయింట్ కన్వీనర్ కొత్తకోట శ్వేతా విఠల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గురువులను శాలువాలతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి, సూర సత్యనారాయణ, లక్ష్మీనారాయణ గుప్త, సుదర్శన్ శెట్టి, నరసింహులు నాయుడు, మొహమ్మద్ సలీం, అలాగే కొత్తకోట పీపుల్స్ స్కూల్ కరస్పాండెంట్ రాజవర్ధన్ రెడ్డి లను వారి నివాసాలకు వెళ్లి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ ఎండోమెంట్ సెల్ వనపర్తి జిల్లా కన్వీనర్ చింతలపల్లి రాధా రెడ్డి, కవితా రెడ్డి, సభిరెడ్డి నారాయణమ్మ, వెంకట్ రెడ్డి, కొమ్ము భరత్ భూషణ్, మద్దిగట్ల శ్రీనివాస్ రెడ్డి, పబ్బ నరేందర్ గౌడ్, వనపర్తి శ్రీనివాస్ రెడ్డి, రాచాల మన్యం, కొమ్ము సురేష్, గండు రవీందర్ రెడ్డి, స్టార్ బాలు, రామకృష్ణా రెడ్డి, చింతలపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురువుల సేవలు సమాజ నిర్మాణానికి పునాది అని, వారి త్యాగం, అంకితభావం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!