సర్పంచ్ గంగమ్మ రవికి కార్మికుల వినతి
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 13 2026: పెద్దమందడి మండలం రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.6 ద్వారా ప్రకటించిన కనీస వేతనాలను గ్రామపంచాయతీ కార్మికులకు అమలు చేసి నెలకు రూ.14,000 నుంచి రూ.18,000 వరకు వేతనాలు చెల్లించాలని గ్రామపంచాయతీ కార్మికులు సర్పంచ్ గంగమ్మ రవికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ… గ్రామాల్లో పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ, ప్రజా సేవల నిర్వహణలో నిరంతరం కష్టపడి పనిచేస్తున్నప్పటికీ తమకు అందుతున్న వేతనాలు జీవన వ్యయాలకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాల జీవో నెం.6ను వెంటనే అమలు చేసి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే జీవో నెం.6 అమలు సాధ్యం కాకపోతే జీవో నెం.60 ప్రకారం వేతనాలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, కుటుంబ పోషణ భారాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయించిన వేతనాలను అమలు చేయాలని కోరారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ గంగమ్మ రవిని కార్మికులు అభ్యర్థించారు.


