ePaper
Friday, November 13, 2026
📄 ePaper

గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ఉపాధి హామీ పనులకు శ్రీకారం -సర్పంచ్ చంద్రశేఖర్

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 13 2026: పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలో గ్రామ అభివృద్ధితో పాటు కూలీలకు స్థానికంగా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఉపాధి హామీ పథకం కింద వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. గ్రామంలో పచ్చదనం పెంపొందించడం, నీటి సంరక్షణ, కాలువల శుభ్రత, మొక్కల పెంపకం వంటి పనులకు ప్రాధాన్యతనిస్తూ గ్రామాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామీణ కూలీలకు స్థానికంగానే పని కల్పించి వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు సర్పంచ్ చంద్రశేఖర్ తెలిపారు. గ్రామంలోని ప్రతి కూలీ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పనుల నిర్వహణలో కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రశేఖర్, ఉపసర్పంచ్ రాములు, పంచాయతీ కార్యదర్శి, క్షేత్రస్థాయి అధికారి పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించడమే ప్రధాన ధ్యేయంగా మోజర్ల గ్రామపంచాయతీ ముందుకు సాగుతోంది.

Latest Articles

మోజర్ల గ్రామంలో బాలల సభ నిర్వహణ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

బాబోయ్ పెద్దపులి..! అటవీ ప్రాంత గ్రామాల్లో మళ్లీ భయాందోళనలు

ఏపీలోని వేలేరుపాడు మండలం కొత్తూరు వద్ద మూడు ఆవులు హతం గోదావరి పరివాహక...

1/70 చట్టం జోలికొస్తే సహించేది లేదు!

ఆదివాసుల హక్కులు, భూముల పరిరక్షణ కోసం నవంబర్ 30న తహసీల్దార్ కార్యాలయం...

రూ.4 కోట్లతో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం

అశ్వారావుపేట మండలంలో విద్యుత్ సరఫరా మెరుగుదలకు చర్యలుఅశ్వారావుపేట, పొలిటికల్ పవర్, ఆర్‌సీ...

డ్రగ్ కంట్రోల్ అధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన ఫార్మసిస్ట్ సంక్షేమ సంఘం నాయకులు…

ఫార్మసిస్టుల సమస్యల పరిష్కారానికి జిల్లా సంఘం కృషి...డ్రగ్ కంట్రోల్ అధికారులను కలిసిన...

Related Articles

పామాపురం పీఏసీఎస్ నూతన చైర్మన్ నాగారపు   బీచుపల్లి యాదవ్ ను సన్మానించిన టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు యం. కిషన్ నాయక్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 14. 2026.పామాపురం పీఏసీఎస్ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ నాగారపు   బీచుపల్లి యాదవ్...

పాలమూరు జిల్లా ప్రజల ఇలవేల్పుగా..భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలిసిన కురుమూర్తి స్వామీ

– శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి దేవస్థానం బ్రహ్మోత్సవనికి ఆహ్వానo పలికిన పాలక మండలి మాజీ సభ్యులు బాదం వెంకటేశ్వర్లు కొత్తకోట,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి...

ఛీకరు చెట్టు తాండలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో ఆర్థిక అవగాహన కార్యక్రమం

జీవిత బీమా పథకం లబ్ధిదారు ఇందిరమ్మకు బీమా పరిహార చెక్కు అందజేత పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 13...
error: Content is protected !!