ePaper
Friday, November 13, 2026
📄 ePaper

పామాపురం పీఏసీఎస్ నూతన చైర్మన్ నాగారపు   బీచుపల్లి యాదవ్ ను సన్మానించిన టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు యం. కిషన్ నాయక్

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 14. 2026.పామాపురం పీఏసీఎస్ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ నాగారపు   బీచుపల్లి యాదవ్ ను శుక్రవారం వనపర్తి జిల్లా కొత్తకోట మండల పరిధిలోని నాటవెల్లి గ్రామంలో ఆయన నివాసంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు యం.కిషన్ నాయక్ మాట్లాడుతూ రైతులకు అండగా నిలుస్తూ, వారి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా నూతన పాలకవర్గం పని చేయాలని సూచించారు.ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో కారణంగా కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, మన రాష్ట్రంలోనే కాదు పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తో సహా అనేక రాష్ట్రాల్లో కరువు నెలకొందని అన్నారు.కరువు నేపథ్యంలో పంటలు ఎండిపోయినా, ఎక్కడైనా పంట నష్టం జరిగినా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు ప్రభుత్వానికి నివేదించాలని, పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతులకు ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే గ్రామాలకు వెళ్లి సంబంధిత అధికారులతో కలిసి సమస్యలను గుర్తించి ప్రభుత్వానికి నివేదించాలని అన్నారు.
పదవులు చేపట్టిన వారు బాధ్యతతో పని చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాటవెల్లి పెద్ద తాండ సర్పంచ్ రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

మోజర్ల గ్రామంలో బాలల సభ నిర్వహణ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ఉపాధి హామీ పనులకు శ్రీకారం -సర్పంచ్ చంద్రశేఖర్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

బాబోయ్ పెద్దపులి..! అటవీ ప్రాంత గ్రామాల్లో మళ్లీ భయాందోళనలు

ఏపీలోని వేలేరుపాడు మండలం కొత్తూరు వద్ద మూడు ఆవులు హతం గోదావరి పరివాహక...

1/70 చట్టం జోలికొస్తే సహించేది లేదు!

ఆదివాసుల హక్కులు, భూముల పరిరక్షణ కోసం నవంబర్ 30న తహసీల్దార్ కార్యాలయం...

రూ.4 కోట్లతో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం

అశ్వారావుపేట మండలంలో విద్యుత్ సరఫరా మెరుగుదలకు చర్యలుఅశ్వారావుపేట, పొలిటికల్ పవర్, ఆర్‌సీ...

డ్రగ్ కంట్రోల్ అధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన ఫార్మసిస్ట్ సంక్షేమ సంఘం నాయకులు…

ఫార్మసిస్టుల సమస్యల పరిష్కారానికి జిల్లా సంఘం కృషి...డ్రగ్ కంట్రోల్ అధికారులను కలిసిన...

Related Articles

గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ఉపాధి హామీ పనులకు శ్రీకారం -సర్పంచ్ చంద్రశేఖర్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 13 2026: పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలో గ్రామ అభివృద్ధితో పాటు...

పాలమూరు జిల్లా ప్రజల ఇలవేల్పుగా..భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలిసిన కురుమూర్తి స్వామీ

– శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి దేవస్థానం బ్రహ్మోత్సవనికి ఆహ్వానo పలికిన పాలక మండలి మాజీ సభ్యులు బాదం వెంకటేశ్వర్లు కొత్తకోట,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి...

ఛీకరు చెట్టు తాండలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో ఆర్థిక అవగాహన కార్యక్రమం

జీవిత బీమా పథకం లబ్ధిదారు ఇందిరమ్మకు బీమా పరిహార చెక్కు అందజేత పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 13...
error: Content is protected !!