ePaper
Friday, September 4, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఘనంగా శ్రీకృష్ణా జన్మాష్టమి వేడుకలు

ఘనంగా శ్రీకృష్ణా జన్మాష్టమి వేడుకలు

📰 Generate e-Paper Clip

–  గోపిక, చిన్ని కృష్ణుడు వేషధారణలతో అలరించిన చిన్నారులు యస్. శ్రీహన్షి, యస్. శ్రీహాన్,

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్. సెప్టెంబర్.05.2026.శ్రీకృష్ణాష్టమి రోజు చిన్న పిల్లల సందడి అంతా ఇంత కాదు. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వాళ్లు తమ బిడ్డలను కన్నయ్యలా అలంకరించి మురిసిపోతారు. పలు ప్రాంతాలలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమిపండుగసందర్బంగాఈదృశ్యాలేకన్పించ్చాయి. కృష్ణుడి వేషధారణలో యస్. శ్రీహాన్,గోపిక వేషధారణలో యస్. శ్రీహన్షి, చిన్నారులు  బాల బాలికలుసంప్రదాయదుస్తులుధరించిఉత్సాహంగాజన్మాష్టమి వేడుకలను జరుపుకున్నారు. చిటిపొట్టి చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలకు కృష్ణుడు, గోపిలు, యశోద వంటి వేషధారణలతో కృష్ణాష్టమి సంబరాలను జరుపుకున్నారు. మగ పిల్లలకు కృష్ణుడి వేషం,ఆడపిల్లలనుగోపికలాతయారుచేసితల్లిదండ్రులు సంతోషించారు. కొన్ని ప్రాంతాల్లో స్కూల్స్ లో కూడా కృష్ణాష్టమి సంబరాలను నిర్వహించారు. తమ స్టూడెంట్స్ కు కృష్ణుడి గోపికలవేషాలువేసివేడుకలను జరిపారు.చిన్నారులు గోపిక, శ్రీకృష్ణ వేషధారణలతో అందరిని ఆకట్టుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!