ePaper
Saturday, November 14, 2026
📄 ePaper

ఘనంగా సాయి ఎక్సలెంట్ స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

జూలూరుపాడు నవంబర్13: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్ :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు లో సాయి ఎక్సలెంట్
స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థుల కోసం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు మరియు వినోద కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ హుస్సేన్ మాట్లాడుతూ, భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పిల్లలంటే ఎంతో ఇష్టమని, ఆయన జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణ,పట్టుదలతో చదువుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. పిల్లల సర్వతోముఖ అభివృద్ధికి పాఠశాల యాజమాన్యం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.

అనంతరం విద్యార్థులకు మిఠాయిలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగలక్ష్మి, నబీనా, ప్రశాంతి, సత్యవతి, కళ్యాణి, అరుణ, భార్గవి, స్వాతి, అనిత, రిచిత, కృష్ణ వేణి, జమున, మమత, రజిత, హరిత, డి.రిచిత విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

Latest Articles

* *నాంపల్లి మండలంలో నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ* 

* *నాంపల్లి మండలం పొలిటికల్ పవర్ న్యూస్* *నాంపల్లి మండలంలో కాంగ్రెస్ *పార్టీ*...

గిరిజన జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలి – మాజీ మంత్రి సత్యవతి రాథోడ్…

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్...

Related Articles

* *కార్తిక మాసం* *నాగుల చవితి *సందర్భంగా ప్రత్యేక కుంకుమ పూజలు.* *అమ్మ వారికి ముడుపు సమర్పణ*

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డిశ్రీ సూర్య ధన్వంతరి ధనలక్ష్మి సహిత దేవాలయంలో, చింత...

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జారె శ్రీకారం!

మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన.. ఇంకుడు గుంతల పనులకు భూమిపూజ నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి పంచాయతీ కార్మికులతో కలిసి భోజనం చేసి వారి కష్టసుఖాలు తెలుసుకున్న ఎమ్మెల్యేపొలిటికల్ పవర్,...

బాబోయ్ పెద్దపులి..! అటవీ ప్రాంత గ్రామాల్లో మళ్లీ భయాందోళనలు

ఏపీలోని వేలేరుపాడు మండలం కొత్తూరు వద్ద మూడు ఆవులు హతం గోదావరి పరివాహక ప్రాంతంలో పులి సంచారంపై అప్రమత్తమైన అటవీశాఖ అధికారులుఅశ్వారావుపేట, పొలిటికల్ పవర్, ఆర్‌సీ ఇన్‌చార్జ్ మేడపురెడ్డి నాగార్జున, నవంబర్ 13:అశ్వారావుపేట పరిసర...
error: Content is protected !!