ePaper
Saturday, November 14, 2026
📄 ePaper

*మావోయిస్టు ప్రభావం నుంచి అభివృద్ధి వైపు భద్రాద్రి కొత్తగూడెం.. నక్సల్ ముక్త్ భారత్‌పై PIB–జిల్లా పోలీసుల మీడియా సదస్సు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్ సిహెచ్ కిషోర్

*2014 నుంచి 2026 వరకు 829 మంది మావోయిస్టుల అరెస్ట్.. 918 మంది లొంగుబాటు*

*మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి, ఉపాధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత*

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు యంత్రాంగం, కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని పత్రికా సమాచార కార్యాలయం సంయుక్తంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో “నక్సల్ ముక్త్ భారత్” అంశంపై మీడియా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఎస్పీ శ్రీమతి సింధు శర్మ, ఐపీఎస్, PIB జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లాలో గతంలో చోటుచేసుకున్న మావోయిస్టు కార్యకలాపాలు, మావోయిస్టుల అరెస్టులు, లొంగుబాట్లు, పోలీసులపై జరిగిన దాడులు, మావోయిస్టు హింస కారణంగా జరిగిన ప్రాణనష్టం, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మీడియా ప్రతినిధులకు వివరించారు.

మావోయిస్టులు గతంలో పోలీస్ స్టేషన్లపై దాడులు చేయడం, రహదారులు, వంతెనలపై ల్యాండ్ మైన్స్ అమర్చడం, పేలుళ్లకు పాల్పడడం వంటి హింసాత్మక చర్యల ద్వారా ప్రజలకు, ప్రభుత్వ ఆస్తులకు తీవ్ర నష్టం కలిగించారు. మావోయిస్టుల దాడులు, హింసాత్మక ఘటనలలో 868 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోగా, 331 మంది పోలీసు సిబ్బంది అమరులయ్యారు. మావోయిస్టు చర్యల వలన రహదారులు, వంతెనలు ధ్వంసం కావడంతో మారుమూల గ్రామాల ప్రజలు రవాణా, వైద్య, విద్యా సదుపాయాలకు దూరమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మావోయిస్టుల హింసాత్మక కార్యకలాపాల వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడటంతో పాటు ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

2014 నుంచి 2026 వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో 829 మంది మావోయిస్టులను అరెస్టు చేయగా, ఇదే కాలంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య 27 ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఫైర్ ఘటనలు చోటుచేసుకోగా 57 మంది మావోయిస్టులు మరణించారు. పోలీసుల నిరంతర చర్యలు, ప్రజల్లో పెరుగుతున్న అవగాహన, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, లొంగుబాట్లు, పునరావాస చర్యల కారణంగా మావోయిస్టు కార్యకలాపాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.

2014 నుంచి 2026 వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో మొత్తం 918 మంది మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. హింసాత్మక మార్గాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చిన వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానం ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ విధానంలో భాగంగా లొంగిపోయిన వారికి వ్యవసాయ భూమి, ఇంటి స్థలం, ఆర్థిక సహాయం, ఆయుధాలతో లొంగిపోయిన వారికి అదనపు ప్రోత్సాహక సహాయం అందించే వెసులుబాటు ఉంది. లొంగిపోయిన వారు సాధారణ జీవితం గడుపుతూ కుటుంబాలతో కలిసి జీవించేందుకు, స్వయం ఉపాధి పొందేందుకు, సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకునేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తోంది.

హింసాత్మక మార్గాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసిన పలువురు మాజీ మావోయిస్టులు ప్రభుత్వ పునరావాస విధానం ద్వారా లబ్ధి పొందుతూ సాధారణ జీవితం గడుపుతున్నారు. ఈరోజు నిర్వహించిన మీడియా సదస్సుకు హాజరైన వారు తమకు ప్రభుత్వం ద్వారా కల్పించిన వ్యవసాయ భూమి, ఇంటి స్థలం, ఆర్థిక సహాయం, స్వయం ఉపాధి అవకాశాలు తదితర పునరావాస సదుపాయాల గురించి వివరించారు. హింసను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత తమ జీవితాల్లో చోటుచేసుకున్న మార్పులను, ప్రభుత్వ సహకారంతో పొందుతున్న ప్రయోజనాలను మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. పునరావాస విధానం తమకు కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, వారికి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. మారుమూల గ్రామాలకు రహదారుల నిర్మాణం, బీటీ రోడ్ల ఏర్పాటు ద్వారా రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తూ గ్రామాలకు అనుసంధానం కల్పిస్తున్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, స్వయం ఉపాధి కార్యక్రమాలకు ప్రోత్సాహం అందించడం, గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పరిశ్రమలు, రైస్ మిల్లుల ఏర్పాటుకు సహకారం అందించడం ద్వారా జీవనోపాధి మెరుగుపడేలా చర్యలు చేపడుతున్నారు. విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, స్టడీ మెటీరియల్ పంపిణీతో పాటు క్రీడా సామగ్రి అందిస్తూ విద్యా, క్రీడా రంగాల్లో ప్రోత్సహిస్తున్నారు.

మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు ఉచిత వైద్య సేవలు, మందులు అందిస్తున్నారు. తాగునీటి సదుపాయాల కోసం బోర్‌వెల్స్ ఏర్పాటు చేయడంతో పాటు వరద ప్రభావిత కుటుంబాలకు దుప్పట్లు, నిత్యావసర సరుకులు పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. క్రీడా పోటీలు, కమ్యూనిటీ అవుట్‌రీచ్ కార్యక్రమాల ద్వారా యువతను సానుకూల కార్యకలాపాల వైపు ప్రోత్సహిస్తూ ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకాన్ని పెంపొందించే చర్యలు కొనసాగిస్తున్నారు.

Latest Articles

ఘనంగా సాయి ఎక్సలెంట్ స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు

జూలూరుపాడు నవంబర్13: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9...

* *నాంపల్లి మండలంలో నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ* 

* *నాంపల్లి మండలం పొలిటికల్ పవర్ న్యూస్* *నాంపల్లి మండలంలో కాంగ్రెస్ *పార్టీ*...

గిరిజన జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలి – మాజీ మంత్రి సత్యవతి రాథోడ్…

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్...

Related Articles

* *నాంపల్లి మండలంలో నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ* 

* *నాంపల్లి మండలం పొలిటికల్ పవర్ న్యూస్* *నాంపల్లి మండలంలో కాంగ్రెస్ *పార్టీ* *ఆధ్వర్యంలో మునుగోడు * శాసనసభ్యులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి* *రాజగోపాల్ రెడ్డి సహకారంతో* *నిరుపేదలకు సీఎం* రిలీఫ్ ఫండ్ *చెక్కులను నాంపల్లి*...

గిరిజన జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలి – మాజీ మంత్రి సత్యవతి రాథోడ్…

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి :మహబూబాబాద్ జిల్లాతెలంగాణ ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా రెండవ మహాసభలు పట్టణంలోని...

నరసింహులపేట మండలంలో జిల్లా కలెక్టర్ విస్తృత పర్యటన విద్యార్థుల విద్యా ప్రమాణాలపై ఆరా.. ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశం పౌష్టికాహారం, మెనూ అమలుపై కఠిన ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్...

 పొలిటికల్ పవర్, నరసింహులపేట / గార్ల ప్రతినిధి "మాలోత్ అజయ్ నాయక్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ గురువారం నరసింహులపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండలంలోని పెదనాగారం గ్రామంలో...
error: Content is protected !!