ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డిచిన్న ఉమ్మెంత్యాలలో మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహణ

చిన్న ఉమ్మెంత్యాలలో మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహణ

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జూన్ 18 2026: రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చిన్న ఉమ్మెంత్యాల గ్రామంలో మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐపీసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆదిత్య రెడ్డి మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా జరిగింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!