బొమ్మెన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి
ఆదివాసీల సాగు భూముల పై అటవీశాఖ అధికారుల దుశ్చర్యలు మానుకోవాలి
*తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం(TAGS) మండల అధ్యక్షులు మడే మదునయ్య*
పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో బొమ్మెన గ్రామంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వారోత్సవాలు జరుపుకోవడం జరిగింది ముందుగా సంఘం జెండాను మండల అధ్యక్షుడు మడే మదునయ్య ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో తరాలుగా ఇక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్న మా ఆదివాసులకు ఈ ప్రభుత్వాలు కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదు దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచినా ఇక్కడి ఆదివాసులకు ఇంకా స్వాతంత్రం రాలేదన్నారు. అనారోగ్యంతో అత్యవసర పరిస్థితిలలో వైద్యం కోసం వెళ్లాలన్న అడవిలో రోడ్డు లేక నానా అవస్థలు పడుతూ ప్రాణాలు అరి చేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన దుస్థితి దాపరించింది అన్నారు, ఈ ప్రభుత్వాలకు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే మేము గుర్తుకు వస్తాము ఆ తర్వాత మా గురించి ఏ నాడు పట్టించుకున్న పాపనా పోలేదు., ఆదివాసీల సాగు భూములపై అటవీ శాఖ అధికారుల ఆంక్షలు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఉన్నతాధికారులు, మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన ఏమాత్రం ప్రయోజనం లేదన్నారు ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారుల నుండి అనుమతులు తీసుకొని తక్షణమే మా గ్రామానికి రోడ్డు సౌకర్యం వేయించి విద్యా వైద్య సదుపాయాలు అందేలా చూడాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అందుకే ప్రపంచ ఆదివాసి దినోత్సవ స్పూర్తి తో మరో పోరాటానికి సిద్ధమవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిడం పోచన్న, బట్టు పుల్లయ్య, లగ్గామ గట్టయ్య, పార్వతీ, కొండయ్య, లచ్చన్న, ఓల తిరుపతి, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

