తల్లిపాలు బిడ్డకు అమృతం – తల్లిపాలే బిడ్డకు గిఫ్ట్

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 05 2026: పెద్దమందడి మండలం, చిలకటోనిపల్లి గ్రామంలో తల్లిపాల వారోత్సవాలను అంగన్వాడి కేంద్రం నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమములో ముఖ్యఅతిథిగా ఐసీడిఎస్, సిడిపిఓ అమృతమ్మ పాల్గొన్నారు. ఈనెల 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు నిర్వహించే తల్లిపాల వారోత్సవాలను ప్రజలకు ఎంతో అవగాహన పెంచాలని సర్పంచ్ కోరారు. అంగన్వాడి కేంద్రం మంగళవారం నాడు గ్రామ సర్పంచ్ ఎం అశ్విత, సూపర్వైజర్ సుధా ఆధ్వర్యం లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తల్లి బిడ్డకు మొదటగా ఇచ్చే గిఫ్ట్ ముర్రుపాలు వాటితో బిడ్డ అమృతంతో సమానంగా పనిచేసే ఈ పాలను ప్రతి తల్లి పట్టించాలని రోగ నిరోధక శక్తి వాటిలో ఎంతో ఉంటుందని ఆమె తెలియజేశారు. గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఐసీడిఎస్, సిడిపిఓ అమృతమ్మ మాట్లాడుతూ.. శిశువు పుట్టిన గంటలోపే తల్లి పాలు పట్టించడం ఎంతో అవసరమని తెలిపారు. తొలి ఆరు నెలల వరకు శిశువుకు కేవలం తల్లి పాలే అందించాలని, అనంతరం పోషకాహారంతో పాటు రెండేళ్ల వయసు వరకు తల్లిపాలను కొనసాగించాలని సూచించారు. బిడ్డ ఆరోగ్యం ఎంతో ముఖ్యమని అందుకు సంబంధించిన ఆరోగ్య అంగన్వాడి సిబ్బంది, చొరవతో పిల్లలను వారి పరిధిలో సమయానికి అందించవలసిన ప్రతిదీ క్రమబద్ధీకరణతో అందించాలని వారు తెలిపారు. తల్లిపాల వల్ల శిశువుకు అవసరమైన పోషకాలు సమృద్ధిగా లభించడంతో పాటు, తల్లుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతోందని తెలిపారు. ముందే పిల్లలు తల్లులు తగు జాగ్రత్తలు తీసుకొని మంచిగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి రాములు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణయ్య ఉపాధ్యాయురాలు భారతి గ్రామ సర్పంచు ఎం అశ్విత మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

