ePaper
Saturday, September 26, 2026
📄 ePaper

జవహర్‌నగర్‌లో దశాబ్దాలుగా నివాసముంటున్న ఇళ్లను రెగ్యులరైజ్ చేయాలి

📰 Generate e-Paper Clip

ప్రజలకు పూర్తి హక్కులు కల్పించాలి.. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతియ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజా శేఖర్ సెప్టెంబర్ 26 2026:  జవహర్‌నగర్ ప్రాంతంలో దశాబ్దాలుగా ఇళ్లు నిర్మించుకుని నివాసముంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాల ఇళ్లను రెగ్యులరైజ్ చేసి, వారికి పూర్తి హక్కులు కల్పించాలని మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ కోరారు. స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జవహర్‌నగర్ ప్రాంతంలో ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న భూములు, ఇళ్ల రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దశాబ్దాలుగా ఇళ్లు నిర్మించుకుని అక్కడే నివాసముంటున్న ప్రజలకు చట్టబద్ధమైన హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందని, వారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వజ్రెష్ యాదవ్ కలెక్టర్‌ను కోరారు. వినతిపత్రంపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ… “ఏళ్ల తరబడి జవహర్‌నగర్‌లో నివాసముంటున్న ప్రజలకు ఇళ్లపై పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తాం. ప్రజల న్యాయమైన హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రపురి కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, జవహర్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు శాంతి కోటేష్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ గొడుగు వేణు, ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, బల్లి శ్రీనివాస్, బింగి సతీష్ గౌడ్, మనోధర్ రెడ్డి, మాట్ల వినయ్ కుమార్, యాదగిరి యాదవ్, ఎర్రగుంట్ల వెంకటేష్, వీర్ల బుజ్జి, నాయకం భాస్కర్, నర్ర మహేష్, బబ్లూ ముదిరాజ్, గజ్వేల్ శంకర్, మాధవరెడ్డి, రఫీక్ తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

ముష్టిబండ ఇనాం భూముల సమస్యను పరిష్కరించాలి: ఎమ్మెల్యే జారెకు వినతి

భూ హక్కులు కల్పించి న్యాయం చేయాలని దళిత రైతుల విజ్ఞప్తి పొలిటికల్ పవర్,దమ్మపేట,...

మనిగిల్లలో గణనాథుడి లడ్డూ ప్రసాదం.. గడప గడపకు పంపిణీ

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

మహాలయ పక్షాలు.........!!భాద్రపద బహుళ పాడ్యమి (సెప్టెంబర్ 26, 2026) నుంచి అక్టోబర్...

*కమల నగర్ కాలనీలో లడ్డు వేలం పాటలో కాటం శిరీష పరమేశ్వర్ దంపతులు 95 వేలకు కైవసం*

మేడిపల్లి: 27 సెప్టెంబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళకాలనీలో తొమ్మిది...

*గణనాథుడికి వీడ్కోలు అంబరాన్ని అంటిన శోభాయాత్ర*

మేడిపల్లి: 27 సెప్టెంబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళమేడిపల్లి కమల...

Related Articles

*గణనాథుడికి వీడ్కోలు అంబరాన్ని అంటిన శోభాయాత్ర*

మేడిపల్లి: 27 సెప్టెంబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళమేడిపల్లి కమల నగర్ కాలనీలో అత్యంత వైభవంగా నవరాత్రులు భక్తి శ్రద్ధలతో, పూజలు, భజనలతో కొలిచిన గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చే మహోత్సవమే...

ఇంద్రపల్లి హరిణి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మార్పీఎస్ జిల్లా బృందం

మృతురాలి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జ్ రవి మాది పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

డీఎస్పీ భీమ్ రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు..

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బజా శేఖర్ సెప్టెంబర్ 26 2026: కొందరు రాజకీయ నేతలు... మరికొందరు బ్యూరోక్రాట్లు భారతదేశ...
error: Content is protected !!