
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ జగ్గయ్యపేట జూన్ 29 2026: జగ్గయ్యపేట పట్టణంలోని ముత్యాలమ్మ గుడి సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో దినోత్సవ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్, వైశ్యరత్న, జనసేన పార్టీ నాయకులు చారుగుండ్ల వెంకట లక్ష్మీనారాయణ కొండ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి, ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ప్రభుత్వ వైద్య సిబ్బంది, చిన్నారులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
జాతీయ పల్స్ పోలియో దినోత్సవంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చారుగుండ్ల వెంకట లక్ష్మీనారాయణ కొండ
RELATED ARTICLES
