ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 తెలుగు న్యూస్ జూన్ 28 డివిజన్ ప్రతినిధి సిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ దేవరకొండ పట్టణంలోని 11, 12 వార్డుల్లో నగరాభివృద్ధి నిధుల కింద “రూ.1 కోటి 42 లక్షల 25 వేల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు” దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలకు నాణ్యమైన రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులను వేగవంతంగా చేపడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. దేవరకొండ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోందని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. రూ.1.42 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు పూర్తయిన అనంతరం ఆయా వార్డుల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలగడంతో పాటు వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోతాయని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, స్థానిక ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

