ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దిగట్ల-మోజర్లలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దిగట్ల-మోజర్లలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 21 2026: పెద్దమందడి మండలం మద్దిగట్ల మోజర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై యోగా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాదరావు మాట్లాడుతూ… యోగా ద్వారా శరీరం పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా మారడమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని అన్నారు. యోగా సాధన మన జీవితాన్ని సుఖసంతోషాలతో గడపడానికి దోహదపడుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు పి. వెంకటస్వామి మాట్లాడుతూ… యోగా భారతదేశానికి చెందిన గొప్ప ఆధ్యాత్మిక సంపద అని, ఎన్నో శతాబ్దాల క్రితమే భారతీయ ఋషులు ప్రపంచానికి యోగాను పరిచయం చేశారని వివరించారు. ఉపాధ్యాయులు గద్వాల కృష్ణ మాట్లాడుతూ… ధ్యానం, ఉపాసన మరియు యోగా సాధన వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయులు ఎన్. వెంకటస్వామి మాట్లాడుతూ… “ఆరోగ్యమే మహాభాగ్యం” అని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ యోగా ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. మరో ఉపాధ్యాయులు ఎ. వెంకటస్వామి మాట్లాడుతూ… భారతదేశంలో పుట్టిన యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం దేశ కీర్తి ప్రతిష్టలకు నిదర్శనమని అన్నారు. విద్యార్థులందరూ ప్రతిరోజూ ఉదయం యోగా, ధ్యానం చేయడంతో పాటు తమ కుటుంబ సభ్యులకు కూడా యోగా ఆసనాలు నేర్పించి ప్రశాంతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ఉపాధ్యాయులు సూచించారు. ఈ కార్యక్రమంలో రికార్డు అసిస్టెంట్ చిన్నారెడ్డి గారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!