
జూలూరుపాడు అక్టోబర్ 16: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్ :/
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు 400 కెవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని టీజి ఎన్పీడీసీఎల్.సిఎండి కర్నాటి వరుణ్ రెడ్డి పరిశీలించి. అధికారులకు దిశా నిర్దేశం చేశారు
. రానున్న రోజుల్లో పెరగనున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచన, విద్యుత్ వినియోగం పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన ముందస్తు చర్యలపై టిజి ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి. జూలూరుపాడు 400 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ సరఫరా వ్యవస్థ పనితీరు, విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా సామర్థ్యం, రాబోయే సీజన్‌లో పెరగనున్న లోడ్‌ను ఎదుర్కొనేందుకు. తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని, విద్యుత్ వ్యవస్థలోని కీలక పరికరాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర సాంకేతిక వ్యవస్థల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.

