ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిజోరుగా టీఆర్పీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

జోరుగా టీఆర్పీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

📰 Generate e-Paper Clip

బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యమని జిల్లా అధ్యక్షుడు విజెయుడు వెల్లడి

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 18 2026: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) సభ్యత్వ నమోదు కార్యక్రమం వనపర్తి జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా, అత్యంత వేగంగా కొనసాగుతోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు విజెయుడు తెలిపారు. తెలంగాణ సమాజంలో దశాబ్దాలుగా వెనుకబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు నిజమైన భరోసా కల్పిస్తూ, వారికి రాజ్యాధికారాన్ని అందించడమే టీఆర్పీ పార్టీ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గ్రామ, మండల, పట్టణ స్థాయిల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహిస్తూ ప్రజల నుంచి విశేష ఆదరణ పొందుతున్నారని అన్నారు. వనపర్తి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, పెద్ద సంఖ్యలో యువత, మహిళలు, సామాన్య ప్రజలు పార్టీ సభ్యత్వం స్వీకరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ వనపర్తి జిల్లా యువజన అధ్యక్షుడు జి. రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు బాలరాజ్ సాగర్, నియోజకవర్గ ఇన్‌చార్జి అరుణ్ కుమార్, గోపాలపేట మండల ఉపాధ్యక్షుడు మాలిక్, పార్టీ నాయకుడు నరేష్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!