ePaper
Saturday, August 1, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్‌లో వర్గపోరు.ఎంపీ వంశీ వర్సెస్ ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు

జూలై 18 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ వంశీకృష్ణ హాజరుకానున్న నేపథ్యంలో కాంగ్రెస్‌లో వర్గపోరు బహిర్గతమైనట్లు సమాచారం. ఎంపీ రాకను అడ్డుకోవడం లో భాగంగా ఈ క్రమంలో ఎమ్మెల్యే వర్గీయులు అక్కడికి చేరుకుని నినాదాలు చేస్తూ ఎంపీకి స్వాగతంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపివేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎంపీ వంశీకి స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు, దళిత సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, జై పీఎస్ఆర్ అంటూ నినాదాలు చేస్తూ ఫ్లెక్సీలు చింపివేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో గూడెం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, కాంగ్రెస్‌లోని అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!