పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 17 2026: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బంజారా తీజ్ పండుగకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డిని వివిధ బంజారా సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఆగస్టు 26న నిర్వహించనున్న తీజ్ పండుగ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై బంజారా సమాజాన్ని ఆశీర్వదించాలని నాయకులు కోరారు. బంజారా సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను పరిరక్షిస్తూ యువతలో వాటిపై అవగాహన పెంపొందించడమే తీజ్ పండుగ ప్రధాన ఉద్దేశ్యమని నాయకులు తెలిపారు. బంజారా సమాజం ఐక్యత, సాంస్కృతిక వారసత్వాన్ని చాటేలా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ బంజారా, గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్, మాజీ అధ్యక్షుడు కబీర్దాస్, డా. ఎం. రవి, ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు రెడ్యా నాయక్, మంగంపల్లి సర్పంచ్ రమేష్ నాయక్, బంజారా సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు వశీరాం నాయక్, బంజారా సేవా సంఘం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు తదితరులు పాల్గొన్నారు. తీజ్ పండుగకు బంజారా సమాజం పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
