ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తితెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 02 2026: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ హైస్కూల్ హరిజనవాడలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ ఆహ్వానం మేరకు వనపర్తి జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ద్యారపోగు వెంకటేష్, మాదారి భోజరాజు ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ పాఠశాల ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన ద్యారపోగు వెంకటేష్, మాదారి భోజరాజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాన్ని స్మరించుకుంటూ, దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన సోనియా గాంధీకి తెలంగాణ సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టమని, అమరుల త్యాగాలు, ఉద్యమకారుల అంకితభావం ఫలితంగానే రాష్ట్రం ఆవిర్భవించిందని తెలిపారు. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తూ, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రజా తెలంగాణ నిర్మాణం మరింత వేగంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ గంధం మదన్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!