ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeతెలంగాణతెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాల పండుగ

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాల పండుగ

📰 Generate e-Paper Clip

గంగా జమున తహజీబ్ సంస్కృతిని కొనసాగించాలి

డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్

43 ఆలయాలలో బోనాల పండుగ నిర్వహణకు రూ. 17.43 లక్షల ఆర్థిక సహాయం, చెక్కుల పంపిణీ

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 01 2026: బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని బోనాల పండుగను ప్రశాంతంగా, ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని 43 ఆలయాలలో బోనాల పండుగ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం కింద రూ. 17.43 లక్షల చెక్కులను జిల్లెలగూడ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి పీ. సబితా ఇంద్రారెడ్డితో కలిసి చిన్నారెడ్డి శనివారం ఆలయ కమిటీలకు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ… గ్రామ దేవతల దీవెనల కోసం ప్రతి ఏటా బోనాల పండుగను ఘనంగా నిర్వహించడం తెలంగాణలో తరతరాలుగా ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. బోనం అంటే భోజనం అని అన్ని రకాల ఆహార పదార్థాల వంటకాలతో గ్రామ దేవతలకు బోనం సమర్పించడం తెలంగాణలో ప్రత్యేకమని చిన్నారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గంగ, జమున ,తహజీబ్ సంస్కృతిని కొనగ కొనసాగించాలని అన్ని మతాలు అన్ని వర్గాలు కలిసిమెలిసి ఐక్యమత్యంతో ముందుకు సాగి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం కృషి చేయాలని చిన్నారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, మాజీ మేయర్ పారిజాతా రెడ్డి, తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ నిత్యానందరావు, స్థానిక నాయకులు కొండారెడ్డి, చేవెళ్ల జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Previous article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!