ePaper
Thursday, September 10, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిదళితుల ఆత్మగౌరవాన్ని అవమానించినబీఆర్ఎస్‌లో ఇంకా దళితులు ఎందుకు..?

దళితుల ఆత్మగౌరవాన్ని అవమానించినబీఆర్ఎస్‌లో ఇంకా దళితులు ఎందుకు..?

📰 Generate e-Paper Clip

– దళితుల అడుగులు పడిన నేలపై పసుపు నీళ్లు చల్లి అవమానించిన పార్టీలో ఉండి మీఆత్మగౌరవాన్ని కోల్పోవద్దు, ఇది కేవలం పార్టీ మార్పు కాదు, మీ ఆత్మ గౌరవం కోసం తీసుకుంటున్న నిర్ణయం,

– దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి బీఆర్ఎస్ దళిత నాయకులకు స్పష్టమైన పిలుపు,

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్.సెప్టెంబర్.11.2026.దళితులఆత్మగౌరవాన్ని అవమానించినబీఆర్ఎస్‌లో ఇంకా దళితులు ఎందుకు ఉన్నారని,గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదు.మీకు రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తూ, మీ గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా చూసే కాంగ్రెస్ పార్టీలోకి రండి. మీకు అండగా నిలిచే బాధ్యత నాదని, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి.గురువారంఒకప్రకటనలోతెలిపారు.ఈసందర్భంగాఆయనమాట్లాడుతూదళితులవిషయంలోబీఆర్ఎస్ చరిత్ర ఇదేనా.తెలంగాణ వస్తే తొలి ముఖ్యమంత్రి దళితుడే అని హామీ ఇచ్చి మాట తప్పింది బీఆర్ఎస్ నాయకత్వం.దళితులకుమూడెకరాలభూమిఇస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఆ హామీని నెరవేర్చలేదనే విమర్శలు ఎదుర్కొందని, దళిత బంధు పేరుతో (నగదు బదిలి) పథకాన్ని తీసుకొచ్చినా దళితుల సంక్షేమాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించుకుని, ఆ తర్వాత పథకాన్ని నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయనిఅన్నారు.తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలోనే దళిత నాయకుడుతాటికొండ రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించిన ఘటన కూడా బీఆర్ఎస్ పాలనపై ప్రశ్నలు లేవనెత్తిందని,మంత్రివర్గంలోనూ, రాజకీయ పదవుల్లోనూ దళితులకు సముచిత ప్రాతినిధ్యం, గుర్తింపుకల్పించలేదనేఅసంతృప్తిఆవర్గాల్లోఉందనిఅన్నారు. కాంగ్రెస్ విధానంలో జి. మధుసూదన్ రెడ్డి
నాయకత్వంలో దళితులు, అణగారిన వర్గాలను మొదటి నుంచిఅక్కునచేర్చుకుని,వారికిరాజకీయంగా సముచితస్థానంకల్పించినపార్టీకాంగ్రెస్,పార్టీని,అవమానంకాదుని,ఆత్మగౌరవంకావాలి,వివక్షకాదని,సమానత్వం కావాలని,ఓటు బ్యాంకు కాదని,రాజకీయ గుర్తింపు కావాలని అన్నారు. అందుకే దేవరకద్ర నియోజకవర్గంలోని దళిత సోదరులు, నాయకులు, కార్యకర్తలందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.దళితులను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా చూడకుండా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానాలు కల్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం మొదటి నుంచి పాటుపడుతున్న కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని ఎమ్మెల్యే జి ఎం ఆర్ దళిత నాయకులకు పిలుపునిచ్చారు.గౌరవంలేనిచోటఉంటూఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి. మీకు రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తూ, మీ గౌరవానికి అండగా నిలిచే బాధ్యత నాదని ఆయన భరోసానిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!