ePaper
Thursday, November 5, 2026
📄 ePaper

*దీపావళి వేడుకల్లో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్* *టపాసుల దుకాణాల కేటాయింపులో పారదర్శకత పాటించాలి* *టపాసుల దుకాణాలలో భద్రతా ప్రమాణాల్లో రాజీ పడొద్దు* *ప్రతి దుకాణంలో విద్యుత్ వైరింగ్ తనిఖీ చేసి ధృవీకరించాలి* *దుకాణాల మధ్య కనీసం 3 మీటర్ల దూరం ఉండాలి* *అగ్నిమాపక వాహనాలు, 108 సేవలు, అత్యవసర వైద్య చికిత్సలు అందుబాటులో ఉంచాలి* *దీపావళి వేడుకలపై సంబంధిత అధికారులు, విక్రయదారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్*

📰 Generate e-Paper Clip

:*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

ఖమ్మం జిల్లా

దీపావళి వేడుకల్లో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు.*మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ లతో కలిసి దీపావళి పండుగ వేడుకలు, టపాసుల విక్రయ దుకాణాల ఏర్పాటు, భద్రతా ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు

.* ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ* ఈ నెల 8వ తేదీన దీపావళి పండుగ ఉన్న నేపథ్యంలో టపాసుల విక్రయాలు, వినియోగం సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. *సాధారణంగా దీపావళి తర్వాత వారం రోజుల వరకు కూడా టపాసులు కాల్చే అవకాశం ఉన్నందున ఆ మేరకు అగ్నిమాపక, వైద్య సేవలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.

టపాసుల దుకాణాల కేటాయింపులో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా లాటరీ పద్ధతిలో కేటాయింపులు చేపట్టాలని అన్నారు. *టపాసుల దుకాణాలను బహిరంగ ప్రదేశాల్లోనే ఏర్పాటు చేయాలని, తాత్కాలిక నిర్మాణాల ఏర్పాటులో మండే స్వభావం కలిగిన పదార్థాలను వినియోగించరాదని స్పష్టం చేశారు.

ప్రతి దుకాణం మధ్య కనీసం 3 మీటర్ల దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని, దుకాణాల మధ్య తగినంత ఖాళీ స్థలం ఉండేలా చూడాలని, *షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరగకుండా ప్రతి దుకాణంలోని విద్యుత్ వైరింగ్‌ను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసి ధృవీకరించాలని ఆదేశించారు.*

అగ్నిమాపక యంత్రాలు, ఇతర అగ్నిమాపక పరికరాలను సిద్ధంగా ఉంచడంతో పాటు అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. *అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవలు అందించేందుకు టపాసుల విక్రయ కేంద్రాల వద్ద 108 వాహనాన్ని అందుబాటులో ఉంచాలని, ప్రథమ, ద్వితీయ స్థాయి కాలిన గాయాలకు అవసరమైన మందులు, వైద్య చికిత్సలను సిద్ధంగా ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.*

టపాసుల విక్రయ కేంద్రాల వద్ద త్రాగునీటి సదుపాయం, పరిసరాల పరిశుభ్రతకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారుల ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి, దీపావళి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు.

*వ్యాపార లాభాల కంటే ప్రజల భద్రతే ముఖ్యమని, ఆదాయం కోసం భద్రతా ప్రమాణాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఖమ్మం నగరంలో రెండు ప్రాంతాల్లో టపాసుల విక్రయ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు.* నగరంలో మరో అనువైన బహిరంగ ప్రదేశం ఉంటే అధికారులు గుర్తించి తెలియజేయాలని, అక్కడ కూడా దుకాణాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

*ప్రజలు పర్యావరణానికి హాని కలిగించని గ్రీన్ క్రాకర్స్ మాత్రమే వినియోగించాలని, కాలుష్యాన్ని పెంచే టపాసులకు దూరంగా ఉండాలని సూచించారు.* దీపావళి వేడుకల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పర్యావరణ పరిరక్షణపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.

*పోలీస్ శాఖ ఏసీపీ మాట్లాడుతూ* ఖమ్మం నగరంలో *టపాసుల దుకాణాల ఏర్పాటుకు 224 దరఖాస్తులు* అందాయని, అందుబాటులో ఉన్న దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయించనున్నట్లు తెలిపారు.

*ఈ సమావేశంలో* డీఎంహెచ్‌ఓ డాక్టర్ రామారావు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్, డీపీఓ వినోద్ కుమార్, రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, విద్యుత్ శాఖల అధికారులు, టపాసుల దుకాణాల యజమానులు, విక్రయదారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు

పెద్దమందడి పోలీసుల తీరుపై బీఆర్‌ఎస్ నేతల ఆగ్రహం.. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోందని...

Related Articles

అలసత్వం వద్దు….పటాకులతో జాగ్రత్త -మేడిపల్లి పోలీసులు  బాణసంచా దుకాణ యజమాలతో సమావేశం అలసత్వం వద్దు….పటాకులతో జాగ్రత్త -మేడిపల్లి పోలీసులు బాణసంచా దుకాణ యజమాలతో సమావేశం

మేడిపల్లి: 05 నవంబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళమేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో బాణసంచా దుకాణ యజమానులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మొత్తం 45 మంది బాణసంచా దుకాణ యజమానులు హాజరయ్యారు. సమావేశంలో,...

283 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను వెంటనే అర్హులైన పేదలకు పంపిణీ చేయాలి. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ చేపట్టాలి – బహుజన్ సమాజ్...

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతి నిధి :తేదీ: 04-11-2026, బుధవారంజిల్లా కలెక్టర్ కార్యాలయం, మహబూబాబాద్ – ప్రజావాణి కార్యక్రమంతొర్రూరు డివిజన్/మున్సిపాలిటీ...

గంజాయి అక్రమ దందాపై మరిపెడ పోలీసుల ఉక్కుపాదం…  రూ.లక్ష విలువైన 2 కిలోల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్…

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతి నిధి :మరిపెడ గంజాయి అక్రమ రవాణా విక్రయాలపై మరిపెడ పోలీసులు ఉక్కుపాదం మోపారు....
error: Content is protected !!