బీఎల్వోలు, బీఎల్ఏ-2లను సన్మానించిన మండల అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి, సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 30 2026: పెద్దమందడి మండలం సర్ (sir) ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా పామిడిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన ఓటర్ ఫారాలను బూత్వారీగా 100 శాతం పూర్తి చేసిన బీఎల్వోలు (BLOలు) మరియు బీఎల్ఏ-2లకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ కొమ్ము వెంకటస్వామి పాల్గొని బీఎల్వోలు, బీఎల్ఏ-2లను శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా కొమ్ము వెంకటస్వామి మాట్లాడుతూ… ఓటర్ ఫారాల 100 శాతం డిజిటలైజేషన్ పూర్తికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించడంలో బీఎల్వోలు, బీఎల్ఏ-2ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం, మాజీ ఎంపీటీసీ ఇంద్ర లక్ష్మారెడ్డి, బీఎల్వోలు సునీత, లక్ష్మి, భాగ్యలక్ష్మి, శారద, బీఎల్ఏ-2లు కొంకలి నర్సింహా, వెంకటయ్య, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

