పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 16 2026: గోపాల్ పేట్ మండలం బుద్ధారం గ్రామ యువకులు బహుజన్ సమాజ్ పార్టీనీ వీడి ధర్మ సమాజ్ పార్టీలో చేరారు. వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ కండువా ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు వీరపాగ రామక్రిష్ణ ఆధ్వర్యంలో డా. విశారదన్ మహారాజ్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకున్నారు. అణగారిన వర్గాల కోసం అంబేద్కర్,కన్షిరామ్ సిద్ధాంతాల భూమికతో ఎస్. సి, ఎస్ టి, బి. సి రాజ్యాధికారం కొరకు డా. విశారదన్ మహారాజ్ ఎంతో గాను కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ ( బుద్ధారం) గడ్డ పై ఇక రాజకీయ యుద్ధం మొదలైందని వారు అన్నారు. చేరిన వారు పి. శివ, పి. కురుమూర్తి, బి.రవి, జి.అశోక్, పి.బాల రాజ్, పి.కళ్యాణ్, పి.శివకుమార్, రాజు పార్టీలో చేరారు.
