దగాకోరు ఆరోపణలతో ప్రజలను మభ్యపెట్టలేరు.. దమ్ముంటే ఆధారాలతో రండి
మేఘారెడ్డిపై బురదజల్లితే బీఆర్‌ఎస్ నేతల గతాన్ని ప్రజల ముందుంచుతాం
3 ఎకరాలు కొన్నట్లు చూపించి 13 ఎకరాలు కబ్జా చేసింది మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వదిన
రూ. 1కోటి 13 లక్షలు గవర్నమెంట్ టాక్స్ ఎగ్గొట్టింది సాక్షాత్తు మాజీ మంత్రి
కుమ్మరి నాగన్నకు గిఫ్ట్ డిడి ఎలా చేస్తారు కుమ్మరి నాగన్న మీ బంధువా..? మీ దయాదుల…?
గిఫ్ట్ డిడి చేసేందుకు వాళ్లకు మీకు ఏం బంధుత్వం సంబంధం
పెయిడ్ బ్యాచ్ తో మా ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేసినంత మాత్రాన అవాస్తవాలు వాస్తవాలు కావు
మాజీ మంత్రి ఆత్మ అయిన మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి ఎమ్మెల్యే భూమి కొనుగోలు, విక్రయాలలో ప్రధాన భూమిక పోషించారు
మీరు ఫిర్యాదు చేయాలనుకుంటే A1గా రఘుపతి రెడ్డి, A2గా అప్పటి మంత్రి మీరే కాబట్టి మీరు ఉండాలి A3 మా ఎమ్మెల్యే ఉంటాడు
ఎమ్మెల్యే నిబంధనలకు విరుద్ధంగా భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న ఆరోపణలపై వాస్తవాలు వెల్లడించిన వెల్టూర్ గ్రామస్తులు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 04 2026: పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామ శివారులో 39 కుంటల భూమిని నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటూ బిఆర్ఎస్ నాయకులు చేసిన తప్పుడు ఆరోపణలు తప్పుడు ఫిర్యాదులపై గురువారం వెల్టూరు గ్రామ ప్రజలు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్న భూమికి సంబంధించిన వ్యక్తులు వాస్తవాలను మీడియాకు వెల్లడించారు. గ్రామానికి చెందిన దానయ్య గారికి చెందిన భూమిని మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి (బిఆర్ఎస్) ప్రస్తుత ఎమ్మెల్యే మేఘారెడ్డికి ఇప్పించారు. తదనంతరం మేఘారెడ్డి నుంచి కొత్తకోట వారికి భూమి అమ్మించింది కూడా రఘుపతిరెడ్డి అని తెలిపారు మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి ప్రధాన భూమిక పోషించి కొనుగోలు విక్రయాలు చేయించిన ఈ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా ఉంటే నిరుపేదలైన రైతులకు చేస్తానని మా దయగల ఎమ్మెల్యే మీడియా ముఖ్యంగానే చెప్పారు. ఇప్పుడు మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి దీనిని నిరూపించాల్సిన అవసరం ఉంది. వెల్టూర్ శివారులో 345, 446 సర్వే నెంబర్ లో గల కుమ్మరి వాళ్ళ ఇనాములో కుమ్మరి నాగన్న దగ్గర నుంచి విదేశాల్లో ఉండే (ఎన్ ఆర్ ఐ) మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వదిన పేరు మీద 3 ఎకరాల 19 గుంటల భూమిని కొనుగోలు చేసి మరో 8 ఎకరాల 6 కుంటలు కబ్జా చేసింది మీరు కాదా అని గ్రామస్తులు మాజీ మంత్రిని సూటిగా ప్రశ్నించారు. ఈ కొనుగోలు చేసిన భూమిని సైతం గిఫ్టు డిడి కింద రిజిస్ట్రేషన్ చేయించుకుని దాదాపు 1 కోటి 13 లక్షల రూపాయల ట్యాక్స్ ని ఎగ్గొట్టారన్నారు. కుమ్మరి నాగన్న, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వదినకు ఏం సంబంధం వల్లేమైనా బంధువుల, దాయాదుల, మరి ఏ విధంగా గిఫ్ట్ డిడ్ చేయించుకున్నారు నిరూపించాల్సిన అవసరం ఉందని వాళ్ళు సవాల్ చేశారు. అవినీతి అక్రమాల కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్ పార్టీ అని నీతి నిజాయితీగా పనిచేస్తున్న ఏకైక వ్యక్తి వనపర్తి శాసన సభ్యులు దయగల రెడ్డని అలాంటి వ్యక్తిపై నిందారోపణలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసుకోవాలని వారు పేర్కొన్నారు. తక్షణమే వెల్టూర్ శివారులో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వదిన పేరు మీద కొనుగోలు చేసి కబ్జా చేసిన భూమిని వారికి అప్పజెప్పకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు. వనపర్తి శాసనసభ్యులు మేఘ రెడ్డికి మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి అమ్మించిన భూమి లవని పట్టా కాదని.. అందుకు సంబంధించి దానయ్య సతీమణి పేరుమీద 1987 నుంచి 2019 వరకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయని ఈ విషయాన్ని ఎక్కడైనా నిరూపిస్తామని వారు పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం కొందరిపై ఒత్తిడి తెచ్చి జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేసినంత మాత్రాన అవాస్తవాలు వాస్తవాలు కావని ఇలాంటి నిందారోపణలు మానుకొని మీరు కబ్జా చేసిన కుమ్మరి వాండ్ల మాన్యాన్ని వారికి వెంటనే అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై ఆరోపణలు చేసే ముందు మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి తన గతాన్ని, తన హయాంలో జరిగిన భూ వ్యవహారాలను ఒక్కసారి తిరగేసి చూసుకోవాలని కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మేఘారెడ్డిని దగా రెడ్డి కాదని దయగల మేఘా రెడ్డి అని అన్నారు ..? ప్రజల కోసం పనిచేస్తున్న దయగల మేఘారెడ్డిపై నోరు పారేసుకునే ముందు.. మీ హయాంలో ప్రజలకు ఏం చేశారో చెప్పే దమ్ముందా?” అంటూ నిలదీశారు. రాజకీయంగా ఎదుర్కోలేక అసత్య ఆరోపణలు, బురదజల్లుడు రాజకీయాలకు దిగడం మాజీ మంత్రి స్థాయికి తగదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని హెచ్చరించారు. నిరంజన్‌రెడ్డి రాజకీయంగా ఇబ్బందుల్లో పడిన ప్రతిసారీ మేఘారెడ్డిపై ఆరోపణలు చేయడం అలవాటుగా మార్చుకున్నారని విమర్శించారు. 2023 ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌కు ఎందుకు గుణపాఠం చెప్పారో, నిరంజన్‌రెడ్డిని ఎందుకు ఇంటికి పంపారో ముందుగా ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. ప్రజల తీర్పును కూడా అర్థం చేసుకోకుండా ఇంకా అదే పాత అహంకార ధోరణితో మాట్లాడితే వచ్చే రోజుల్లో మరింత రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మేఘారెడ్డిపై దళితుల భూములను అక్రమంగా ఇతరులకు అప్పగించారని ఇటీవల బీఆర్‌ఎస్ నాయకులు చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆరోపణల్లో ఒక్క శాతం నిజం ఉన్నా ఆధారాలతో ప్రజల ముందుకు రావాలని, లేనిపక్షంలో తప్పుడు ఆరోపణలు చేసినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వాస్తవాలను వక్రీకరించి దళితుల పేరును రాజకీయంగా ఉపయోగించుకోవడం బీఆర్‌ఎస్ నాయకుల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఎస్సీ, ఎస్టీల భూములపై ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు తమ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ వివాదాలపై ముందుగా సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, ఇతర ప్రభుత్వ నిర్మాణాల పేరుతో భూములు తీసుకున్న సందర్భాల్లో బాధితుల పక్షాన ఎందుకు నిలబడలేదని ప్రశ్నించారు. ధరణి వ్యవహారాల్లో సామాన్య ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులపై అప్పట్లో ఎందుకు స్పందించలేదని నిలదీశారు. “అధికారంలో ఉన్నప్పుడు ప్రజల గోడు వినిపించలేదు.. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చి దళితుల భూముల పేరుతో రాజకీయాలు చేస్తారా? అంటూ కాంగ్రెస్ నాయకులు నిరంజన్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను మభ్యపెట్టడం వల్లే బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, 2023 ఎన్నికల్లో ప్రజలు బ్యాలెట్ ద్వారా గట్టి సమాధానం ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పాలనకు పెద్దపీట వేస్తూ పేదలు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల సంక్షేమానికి చర్యలు చేపడుతోందని తెలిపారు. పట్టాలు, అసైన్‌మెంట్ భూములు, ఇందిరమ్మ ఇళ్లు తదితర సంక్షేమ కార్యక్రమాల ద్వారా అర్హులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న మేఘారెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్‌ఎస్ నాయకులు వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ నాయకులు ఇప్పటికైనా చౌకబారు విమర్శలు మానుకోవాలని, ఏ ఆరోపణ చేసినా ఆధారాలతో ప్రజల ముందుకు రావాలని సూచించారు. లేదంటే బీఆర్‌ఎస్ నేతల గత పాలన, అప్పటి నిర్ణయాలు, భూ వ్యవహారాలపై కాంగ్రెస్ పార్టీ కూడా ఆధారాలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తున్న తీరు, ప్రజలకు అందుబాటులో ఉండే విధానం పట్ల ఆకర్షితులై పలువురు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు.“మేఘారెడ్డిపై బీఆర్‌ఎస్ నేతలు ఎంత బురదజల్లితే.. అంతగా ప్రజల్లో ఆయనకు సానుభూతి, మద్దతు పెరుగుతోంది. అందుకే నిరంజన్‌రెడ్డి సహా బీఆర్‌ఎస్ నాయకులు అసహనంతో మాట్లాడుతున్నారు”అని ఎద్దేవా చేశారు. ఇకనైనా నిరంజన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు వాస్తవాలతో మాట్లాడాలని కాంగ్రెస్ నాయకులు హితవు పలికారు. “మేఘారెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక ఆరోపణలతో దాడి చేయడం కాదు.. దమ్ముంటే ప్రజల ముందుకు రండి. మీ పాలనలో ఏం చేశారో లెక్క చెప్పండి. మేఘారెడ్డి చేసిన అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై మేము లెక్క చెబుతాం. ఎవరి రికార్డు ఏంటో ప్రజలే తేల్చుతారు”అని ఘాటుగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కోళ్ల వెంకటేష్, వనపర్తి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సర్పంచ్ వాల్య నాయక్ పెద్దమందడి మండల అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి, వనపర్తి మండల అధ్యక్షుడు రవికిరణ్ యాదవ్, పెబ్బేరు మండల కాంగ్రెస్ నాయకులు గంధం రంజిత్ కుమార్, సర్పంచులు రవి నాయక్, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహేష్, సురేష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

